CREATE MORE DEVOTEE-FRIENDLY FACILITIES IN ANANTAVARAM & AMARAVATI SV TEMPLES -TTD JEO _ అనంతవరం, అమరావతి ఆలయాల్లో భక్తులకు మరిన్ని సదుపాయాలు – అధికారులకు జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆదేశం

Tirupati, 21 April 2023: TTD JEO Sri Veerabrahmam directed officials to promote more devotee-friendly facilities in Sri Venkateswara Swamy temples at Anantavaram and Amaravati in Guntur district.

 

During his inspection to these temples on Friday with a team of officials led by him, the JEO instructed officials to put up shelters on the ghat road of Anantavaram, waiting Hall, lighting on ghat roads, a compound wall and Kalyana Mandapams.

 

At Amaravati temple, he directed engineering officials to put up gardens, landscaping, complete the four Mada streets, parking, Pushkarani, sign boards, Arch near Mahadwaram, compound wall, waiting hall, security room and quarters for archakas and employees besides air blower in the temple Sannidhi.

 

Chief Engineer Sri Nageswara Rao, SEs Sri Satyanarayana, Sri Venkateswarlu, PRO Dr T Ravi, Dyeo Sri Venkataiah, Deputy EEs Sri Nagabhushana, Sri Nagraj were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPA

అనంతవరం, అమరావతి ఆలయాల్లో భక్తులకు మరిన్ని సదుపాయాలు – అధికారులకు జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆదేశం

తిరుపతి 21 ఏప్రిల్ 2023: గుంటూరు జిల్లా అనంతవరం, అమరావతి ల్లోని శ్రీవారి ఆలయాల్లో భక్తులకు మరిన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

జేఈవో ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం ఈ రెండు ఆలయాలను పరిశీలించింది.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, అనంతవరం శ్రీవారి ఆలయానికి వెళ్ళే ఘాట్ రోడ్డు ను భక్తులకు సౌకర్యవంతంగా ఆధునీకరించాలని చెప్పారు. భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా షెల్టర్ నిర్మించాలన్నారు. ఆలయం చుట్టూ కాంపౌండ్ వాల్, దాతల సహకారంతో భక్తులు వేచి ఉండటానికి హాల్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని శ్రీ వీరబ్రహ్మం ఆదేశించారు. కల్యాణ మండపంలో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని, ఆలయానికి వెళ్ళే ఘాట్ రోడ్డులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. కొండ కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని భక్తులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అమరావతి ఆలయంలో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఉద్యాన వనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పెండింగులో ఉన్న నాలుగు మాడ వీధులను త్వరగా ఏర్పాటు చేయాలని జేఈవో తెలిపారు. భక్తులకు పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేయాలని, పుష్కరిణి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ మార్గాల ద్వారా ఆలయానికి వచ్చే భక్తుల సదుపాయం కోసం సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఆలయ ముఖ ద్వారం వద్ద ఆర్చి, కాంపౌండ్ వాల్, భక్తులు వేచి ఉండే హాల్, సెక్యూరిటి గది, ఉద్యోగులు, అర్చకుల క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సన్నిధిలో విద్యుత్ బ్లోయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ లు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, పిఆర్వో డాక్టర్ రవి, డిప్యూటి ఈవో శ్రీ వెంకటయ్య, డిప్యూటి ఈఈ శ్రీ నాగభూషణం, విద్యుత్వి భాగం డిప్యూటీ ఇంజినీర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది