BALALAYA SAMPROKSHANAM _ ఏప్రిల్ 26, 27వ తేదీల్లో శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయ బాలాలయ సంప్రోక్షణ

TIRUPATI, 21 APRIL 2023: The Balalaya Mahasamprokshanam of Sri Seshachala Lingeswara Swamy located in Kandulavaripalli in Chandragiri Mandal will be observed on April 26 and 27.

 

During Balalaya Mahasamprokshanam the main deities power will be transformed onto the photos which will be kept in the replica temple set up in Mukha Mandapam. Till the completion of the rituals, the deities will be offered prayers.

 

On April 26, from 4pm onwards Ganapathi Puja, Punyahavachanam, Vastu Homam, Medini Puja, Mritsangrahanam, Ankurarpanam will be performed.

 

While on April 27, Ganapathi Puja, Punyahavachanam, and Yagasala Pujas will be performed. At 10:55am Purnahuti, Samprokshana were performed.

 
\ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 26, 27వ తేదీల్లో శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయ బాలాలయ సంప్రోక్షణ

తిరుపతి, 2023 ఏప్రిల్ 21: చంద్రగిరి మండలం కందులవారి పల్లిలోని
శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ 26, 27వ తేదీల్లో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఏప్రిల్ 26 వ తేదీ సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తు హోమం, మేదిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 27వ తేదీ ఉద‌యం 7.30 గంట‌లకు గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల పూజచేపడతారు. ఉదయం 10.55 గంట‌లకు పూర్ణాహుతి, సంప్రోక్ష‌ణ‌ నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.