POPULARISE ANNAMAIAH AND VENGAMAMBA SANKEERTANAS – TTD EO _ అన్నమయ్య, వెంగమాంబ కీర్తనలను మరింతగా జనంలోకి తీసుకుని వెళ్ళాలి : టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి

Tirupati, 20 April 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy has directed the officials concerned and urged scholars to popularise the sankeertanas of Annamacharya and Tarigonda Vengamamba which heralded the glory of Sri Venkateshwara by placing them in the public domain.

Reviewing the progress of all TTD dharmic projects at his chambers in TTD administrative buildings on Tuesday evening the TTD EO also listened to Annamaiah and Vengamamba sankeetans sung by Sri Sai Krishna Yachendra, SVBC Chairman and produced by SVBC.

Appreciating the sankeetans the TTD EO directed that they should be telecast on SVBC in between regular programs.

After a presentation on the progress of Dasa Sahitya sankeetans by the Project Special Officer,   he directed that all sankeetans with commentaries should be uploaded on the TTD website soon. 

In view of the raging Covid pandemic, he asked officials for suggestions on how to conduct the Sri Kalyanamastu – mass poor wedding program.

Director of Annamacharya Project Sri Dakshinamurthy Sharma, HDPP secretary Acharya Rajagopalan, Dasa Sahitya Project Special Officer Sri Ananda Thirthachary, SVBC CEO Sri Suresh Kumar were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నమయ్య, వెంగమాంబ కీర్తనలను మరింతగా జనంలోకి తీసుకుని వెళ్ళాలి : టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి

తిరుపతి 20 ఏప్రిల్ 2021: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ తాళ్ళ పాక అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ రాసిన కీర్తనలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.

తిరుపతి పరిపాలన భవనంలోని తన చాంబర్లో మంగళవారం ఈవో వివిధ ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర స్వరపరచగా, ఎస్వీ బీసీ చిత్రపరచిన అన్నమయ్య, వెంగమాంబ కీర్తనలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సాయి కృష్ణ యాచెంద్ర స్వరపరచిన కీర్తనలు బాగున్నాయని చెప్పారు. కార్యక్రమాల మధ్యలో వీటిని ప్రచారం చేయడానికి చర్యలు తీసుకోవాలని కొన్ని సూచనలు చేశారు.

అన్నమాచార్య సంకీర్తనలకు అర్థ, తాత్పర్యాలతో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి జరుగుతున్న కార్యక్రమం ప్రగతి గురించి చర్చించారు. 599 దాస సాహిత్య కీర్తనలు తమ వద్దకు వచ్చాయని ప్రత్యేకాధికారి వివరించారు. పూర్తి అయినవి అయినట్లు టీటీడీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఈవో ఆదేశించారు.

అన్నమాచార్య, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టులకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి తనకు అందించాలన్నారు.

కోవిడ్ కేసులు పెరుగుతున్నందువల్ల కళ్యాణ మస్తు కార్యక్రమం ఎలా నిర్వహించవచ్చో ఆలోచన చేయాలన్నారు.

అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ దక్షిణామూర్తి, హిందు ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది