APPALAYAGUNTA BRAHMOTSAVAMS _ అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 23 MAY 2023: In connection with the annual brahmotsavams in Sri Prasanna Venkateswara Swamy temple.at Appalayagunta from May 31 to June 8, Koil Alwar Tirumanjanam was held on Tuesday.

Ankurarpanam will be held on May 30 while Dhwajarohanam on May 31.

The important days includes Kalyanotsavam on June 3, Garuda Seva on June 4, Rathotsavam on June 7, Chakra Snanam on June 8

All the morning vahana sevas takes place between 8am and 9am while the evening vahana sevas will be observed between 7pm and 8pm. The Kalyanotsavam will be performed between 4:30pm and 7pm on payment of Rs.500 per ticket on which two grihasta devotees will be allowed.

Temple Superintendent Smt Srivani and others participated in the Koil Alwar Tirumanjanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుప‌తి, 23 మే 2023: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

ఉదయం 11.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శివకుమార్, పాల్గొన్నారు.

మే 30వ తేదీ అంకురార్పణ

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో మే 30వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

31-05-2023-   ధ్వజారోహణం      -పెద్దశేష వాహనం

01-06-2023 – చిన్నశేష వాహనం   హంస వాహనం

02-06-2023 –  సింహ వాహనం     ముత్యపుపందిరి వాహనం

03-06-2023 –   కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

04-06-2023 –    మోహినీ అవతారం   గరుడ వాహనం

05-06-2023 హనుమంత వాహనం      గజ వాహనం

06-06-2023   సూర్యప్రభ వాహనం       చంద్రప్రభ వాహనం

07-06-2023    రథోత్సవం                      అశ్వవాహనం

08-06-2023    చక్రస్నానం                   ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.