KOIL ALWAR IN GT HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి, 2026 మార్చి 16: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 19వ తేదీ ఉగాది ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. తరువాత ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాల్ అమ్మవారు, […]
