ELABORATE ARRANGEMENTS FOR AMMAVARI PANCHAMI THEERTHAM _ అమ్మవారి పంచమి తీర్థానికి ప‌టిష్ట‌ ఏర్పాట్లు

FIRST TIME THREE GERMAN SHED SHELTERS FOR DEVOTEES ERECTED

 

ANNA PARASADAM, DRINKING WATER AND BEVERAGES FOR DEVOTEES ARRANGED

 

SPECIAL QUEUE LINES FOR PUSHKARINI ENTRY

 

Tirupati,26 November 2022: Under the special supervision of JEO Sri Veerabrahmam TTD has made extensive arrangements for devotees anticipated for the Panchami Thirtham fete on November 28, as part of finale of the ongoing Karthika Brahmotsavam of Sri Padmavati temple, Tiruchanoor.

 

All safeguards have been taken for devotees holy bath in the Pushkarini on that day. TTD has made wide preparations to provide Anna Prasadam, drinking water besides coffee, milk and tea in the special sheds from Sunday night itself.

 

ENGINEERING WORKS

 

All engineering works like queue lines, barricades, entry and exit gates of Pushkarini, sign boards etc. were completed in the guidance and supervision of chief engineer Sri Nageswara Rao.

The German sheds were installed at Navjeevan eye hospital, Pudi road, high school grounds for devotees to wait for a holy bath in Pushkarini.

 

SECURITY 

 

Besides 2500 policemen,1000 Srivari Sevakulu, TTD vigilance, scouts and guides and NCC are deployed to provide safety and security to devotees.

 

ANNAPRASADAM COUNTERS

 

Nearly 120 food counters have been set up by TTD including 50 at Tolappa Gardens, 20 at high school, 25 at Navjeevan eye hospital and 25 at Pudi road. Food counters are also kept at parking lots.TTD has organised a stock of 1.75 lakh water bottles under the health department besides buttermilk sachets, drinking water, milk, badam milk, snacks and Anna Prasadam.

 

TOILET 

 

It is estimated that thousands of devotees from Tamilnadu and neighbouring districts would descend for the holy bath and 500 toilets are set up including mobile, temporary and permanent toilets are readied for their facilitation. TTD has deployed 700 sanitary workers.

 

SIGN BOARDS

 

TTD has placed sign boards at all regions indicating Darshan hours, Anna Prasadam, toilets and parking areas.

 

MEDICARE 

 

Three primary health centres have been set in the sheds along with one ambulance each and two more ambulances near the temple and Tolappa gardens and another 10 vehicles along with medicines, paramedical staff and doctors.

 

Doctors from SVIMS, TTD Ayurveda and Ruia hospital are deployed besides Fire services and NDRF forces are also in place.

 

PARKING 

 

Parking area have been created at Shilparamam, Tanapalli cross, Market yard, Rahul convention Center, Pudi junction, Tiruchanoor road for devotees to park vehicles and walk upto Pushkarini.

    

SRIVARI SEVAKULU

 

TTD has deployed nearly 1000 Srivari Sevakulu to be in position from Sunday evening and guide the devotees coming from various regions.

 

POWER 

 

Power lighting fans etc have been installed at all the three German sheds along with a generator for emergencies.

 

LED screens have been installed on all four sides of Pushkarini and temporary sheds to view the holy event.

 

TTD APPEALS 

 

TTD appeals to devotees to cooperate with police, vigilance, volunteers and reach the Pushkarini from the sheds without hassles.

 

TTD has also set up help desks for the benefit of devotees to know about services, events and facilities available on important days.

 

PANCHAMI SIGNIFICANCE LASTS FOR THE ENTIRE DAY

 

TTD appealed that Panchami Thirtha snanam significance lasts throughout the day though the Archakas conducts the holy dip of Sudarshana Chakrattalwar in the auspicious hour between 11.40am and 11.50 am.

 

TTD urged devotees to be patient and experience the holy bath without fail during the day. The Panchami thirtha proceedings will be telecast live by the SVBC channel.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అమ్మవారి పంచమి తీర్థానికి  ప‌టిష్ట‌ ఏర్పాట్లు 
 
–  తొలిసారి భక్తులు సేద తీరేలా మూడు కేంద్రాలు
 
–  భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, తేనీరు ఏర్పాటు
 
–  ప్రత్యేక క్యూలైన్ల ద్వారా పుష్కరిణిలోకి భక్తులను పంపేలా ఏర్పాట్లు 
 
తిరుపతి, 2022 నవంబర్ 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబరు 28వ తేదీ  జరుగనున్న పంచమి తీర్థానికి విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం జేఈవో శ్రీ వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేప‌ట్టింది.  భక్తులు ప్రశాంతంగా అమ్మవారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా వేలాది మంది భక్తులు సేద తీరేలా ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్లు నిర్మించి ఆదివారం రాత్రి నుంచే ఇక్కడ అన్నప్రసాదాలు, తాగునీరు, తేనీరు అందించేందుకు సిద్ధం అయ్యింది. 
 
ఇంజినీరింగ్‌
 
టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, ప‌ద్మ‌పుష్క‌రిణిలోనికి ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ గేట్లు, సూచిక బోర్డులు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు పూర్తయ్యాయి.
 
వేలాది మంది భక్తులు వేచి ఉండేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, పూడి మార్గం, హైస్కూలు ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు, రేకుల షెడ్లు ఏర్పాటు చేసింది.  
 
భ‌ద్ర‌త‌
 
భ‌క్తుల సౌక‌ర్యార్థం జిల్లా పోలీసు శాఖ తో కలసి టీటీడీ నిఘా, భ‌ద్ర‌త  విభాగం ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టింది.  టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్  ఎన్‌.సి.సి.విద్యార్థులతో పాటు  2,500  పోలీసు సిబ్బందితో పటిష్ట మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టింది.
 
అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు
     
భ‌క్తుల సౌక‌ర్యార్థం  120 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళ‌ప్ప గార్డ‌న్స్‌లో 50,  హైస్కూల్ వ‌ద్ద 20,   నవజీవన్ ఆసుపత్రి వ‌ద్ద 25, పూడి రోడ్డు వద్ద లో ఏర్పాటు చేసిన షెడ్ లో  25 అన్న‌ప్ర‌సాదం పంపిణీ కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు.  దీనికి అదనంగా పార్కింగ్ ప్రాంతాల్లో కూడా  అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
అదేవిధంగా క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, పాలు, బాదంపాలు, అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు, మ‌జ్జిగ‌ పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేశారు. 
   
ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 1 లక్ష 75 వేల వాటర్ బాటిళ్లను భక్తులకు పంపిణీ చేస్తారు.
 
మ‌రుగుదొడ్లు – 
 
ఆదివారం రాత్రికే తమిళనాడు తో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తిరుచానూరుకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లుగా శాశ్వ‌త, తాత్కాలిక, మొబైల్‌ అన్నీ కలిపి సుమారు 500 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.  ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేయడానికి అదనంగా  700 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియ‌మించారు. ఆదివారం ఉదయం నుంచే వీరు విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
 
సూచిక బోర్డులు – 
     
అమ్మ‌వారి ద‌ర్శ‌న స‌మ‌యం, అన్న‌ప్ర‌సాదాలు, మ‌రుగుదొడ్లు, పార్కింగ్   ప్రాంతాల‌ను భ‌క్తులు సుల‌భంగా గుర్తించేందుకు వీలుగా  వివిధ ప్రాంతాల‌లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
 
వైద్యం –  
    
భక్తుల కోసం ఏర్పాటు చేసిన మూడు షెడ్లల్లో మూడు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రం వద్ద ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు తోళ్లప్ప గార్డెన్, ఆలయం వద్ద అదనంగా రెండు అంబులెన్స్ లు సిద్దంగా ఉంచుతారు. ఇవి కాకుండా ఒక 108 కూడా సిద్ధం చేశారు.   వైద్య‌, పారా మెడిక‌ల్ సిబ్బంది, అవ‌స‌ర‌మైన మందులను అందుబాటులో ఉంచారు. స్విమ్స్‌, రుయా, టీటీడీ ఆయుర్వేద ఆసుప‌త్రుల‌కు చెందిన వైద్యులు భ‌క్తుల‌కు సేవ‌లందిస్తారు.  ఫైర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 
 
పార్కింగ్ – 
    
పంచ‌మి తీర్థానికి విచ్చేసే భ‌క్తులకు శిల్పారామం, త‌న‌ప‌ల్లి క్రాస్‌, మార్కెట్‌యార్డు, రాహుల్ కన్వెన్షన్ సెంటర్, పూడి జంక్ష‌న్‌, తిరుచానూరు శివారు  వ‌ద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను ఈ ప్రాంతాల్లో పార్కింగ్ చేసి పుష్కరిణికి నడచి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
 
శ్రీ‌వారి సేవ‌కులు – 
 
పంచ‌మి తీర్థంలో భ‌క్తుల‌కు  సుమారు 1000 మంది శ్రీ‌వారి సేవ‌కులు  ఆదివారం సాయంత్రం నుంచే వివిధ ప్రాంతాల్లో సేవ‌లందిస్తారు. 
 
విద్యుత్
     
భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు షెడ్లల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో షెడ్ వద్ద ఒక భారీ సామర్థ్యం కల జనరేటర్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. 
       
దీంతో పాటు పంచమితీర్థం కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు, పుష్కరిణి నలువైపులా, మాడ వీధుల్లో
ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 
 
భక్తులకు విజ్ఞపి 
 
భక్తులను తాత్కాలిక షెడ్ల నుంచి క్రమ పద్ధతిలో పుష్కరిణికి పంపేలా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు పోలీసు, టీటీడీ భద్రత అధికారులు, సిబ్బందికి సహకరించి వారి సూచనలు పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని అవసరమైన వారు ఈ సేవలు ఉపయోగించుకోవాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది.
 
రోజంతా పంచమి ప్రాశస్త్యం
   
ప‌ద్మ‌పుష్క‌రిణిలో సోమవారం ఉదయం 11.40 నుండి 11.50 గంటల మధ్య  చక్రస్నానం  కార్యక్రమాన్ని అర్చ‌కులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పంచమి తీర్థం ప్రాశస్త్యం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.
       
పంచమి తీర్థం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.