TTD BOARD TO APPROVE GARUDA VARADHI EXTENSION WORKS _ అలిపిరి దాకా గరుడ వారధి

Tirumala, 18 June 2021: TTD Chairman Sri YV Subba Reddy reiterated that the TTD board will on Saturday decide on the issue of extension of Garuda Varadhi works up to Alipiri to resolve traffic problems in Tirupati.

Speaking to media on Friday at Annamaiah Bhavan in Tirumala, the TTD Chairman said he had received many representations from people’s representatives and other sections of the public on the need for extending the prestigious Garuda Varadhi flyover up to Alipiri tollgate. In view of above the TTD Board will deliberate on cost estimates of the extension works etc. in the board meeting scheduled on June 19.

He said the TTD could not implement the board decision to revive Kalyanamastu (free mass wedding to poor families) launched earlier by the former CM of AP Late Sri YS Rajasekhara Reddy and also to build 500 Sri Venkateshwara temples in SC/ ST/ BC and fishermen colonies as part of Hindu dharma Pracharam due to Covid pandemic. But both programs will be revived and implemented once things turn to normalcy.

The Chairman said during the last 18 months of Covid first and second waves, TTD had launched several programs for the well-being of people. TTD launched several spiritual programs like Sundarakanda, Bhagavat Gita, Virat Parva Parayanams and various other spiritual programmes giving live telecast through SVBC seeking Sri Venkateswara Swamy blessings to get relief to the entire humanity from the pandemic of Covid.

The board meeting on Saturday will also deliberate on providing Srivari Darshan to more devotees in adherence to Covid guidelines, he said.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అలిపిరి దాకా గరుడ వారధి

బోర్డ్ సమావేశంలో చర్చిస్తాం

– కోవిడ్ వల్ల కొన్ని నిర్ణయాలు అమలు చేయలేక పోయాం

మీడియాతో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 18 జూన్ 2021: తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించాల్సి ఉందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగే బోర్డ్ మీటింగ్ లో ఈ విషయం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తిరుమల లో శుక్రవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుపతిలో ట్రాఫిక్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగించాలని ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయన్నారు. ఈ మేరకు తాను పరిశీలన జరిపినట్లు చైర్మన్ తెలిపారు. గరుడ వారధి ఇప్పుడు ముగిసే చోటి నుంచి అలిపిరి వరకు నిర్మించడానికి కొత్తగా అంచనాలు తయారు చేయించేలా శనివారం బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన కళ్యాణ మస్తు సామూహిక వివాహాల కార్యక్రమాన్ని పునః ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నా, కోవిడ్ కారణంగా అమలు చేయలేకపోయామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్టీ, ఎస్సీ,బీసీ, మత్స్యకార గ్రామాల్లో 500 ఆలయాలు నిర్మించాలనే నిర్ణయం కూడా కోవిడ్ వల్ల అమలు చేయలేక పోయామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు అమలు చేసే అంశం మీద నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. గత ఏడాదిన్నరగా కోవిడ్ వల్ల జన జీవనం ఇబ్బందిగా తయారైనా, టీటీడీ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రపంచ ప్రజలందరు ఆరోగ్యంగా ఉండేలా ఆశీస్సులు అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సుందరకాండ పారాయణం, విరాట పర్వం పారాయణం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాబోయే రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించే అంశం కూడా శనివారం నాటి సమావేశంలో చర్చిస్తామని ఆయన తెలిపారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది