PAVITROTSAVAMS AT SRIVARI TEMPLE FROM AUG 18-20 _ ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirumala, 10 August 2021: TTD is organizing the annual Pavitrotsavam mahotsavam at srivari temple in ekantham from August 18-20 with Ankurarpanam on August 17 in view of COVID-19 guidelines.

Puranic legends show that the unique mahotsavam was conducted in all vaishnavite temples since the 15th century and revived by TTD in1962 to ward off the bad impact of any lapses during yearlong rituals and utsavas by either devotees or archakas.

As part of the festivities, snapana thirumanjanam is performed daily to utsava idols of Sri Malayappa swami and His consorts. Thereafter in the evening, the well-bejewelled utsava idols are taken out in procession on the Mada streets.

As part of the festivities the Pavitra pratista is observed on August 18, Pavitra Samarpana on August 19 and Purnahuti will be held on August 20.

In view of the celebrations, the TTD has cancelled all virtual sevas like Kalyanotsavam, Unjal seva, arjita brahmotsavam and Sahara Dipalankara Sevas on August17- 20.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల, 2021 ఆగ‌స్టు 10: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగ‌స్టు 17న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

 ఆగ‌స్టు 18న పవిత్ర‌ ప్రతిష్ట, ఆగ‌స్టు 19న పవిత్ర సమర్పణ, ఆగస్టు 20న పూర్ణాహుతి నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

ప‌విత్రోత్స‌వాల కార‌ణంగా ఆగ‌స్టు 18 నుండి 20వ తేదీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా ఆగ‌స్టు 17న అంకురార్ప‌ణ సంద‌ర్భంగా సహస్రదీపాలంకార సేవను ర‌ద్ధు చేసింది.

కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.