SALE OF 2020 TTD DIARIES AND CALENDARS IN ONLINE-JEO _ ఆన్‌లైన్‌లో టిటిడి 2020 క్యాలెండర్లు, డైరీలు పంపిణీకి ప‌టిష్ఠ చ‌ర్య‌లు : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirupati, 25 Oct. 19: The sale of 2020 TTD Calendars and Diaries should be made available in on-line and should be dispatched in a concrete manner through Postal Department across the country,  said, JEO Sri P Basant Kumar. 

A review meeting was held with Saleswing, Postal department in Conference Hall of TTD Administrative Building in Tirupati on Friday.

He directed the officials concerned to ensure that the calendars and diaries which are booked in online should be delivered to the devotees on time. “Till last year there were stock points in Tirupati only. But this year New Delhi, Mumbai, Bengaluru,  Chennai,  Hyderabad,  Vijayawada, Visakhapatnam are also added. So the calendars and diaries should be dispatched from these nearby points for online bookings”,  he added.

The JEO also said, there should not be any problem this year keeping in view the past experience.

Saleswing DyEO Sri Vijay Kumar and other officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఆన్‌లైన్‌లో టిటిడి 2020 క్యాలెండర్లు, డైరీలు పంపిణీకి ప‌టిష్ఠ చ‌ర్య‌లు   : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2019 అక్టోబ‌రు 25: టిటిడి ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న క్యాలెండర్లు, డైరీలను భక్తుల‌కు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు, పోస్ట‌ల్ ద్వారా పంపిణీకి ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని స‌మావేశ మందిరంలో శుక్ర‌వారం జెఈవో టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విక్ర‌య విభాగం, టిటిడి సమాచార కేంద్రాలు, పోస్ట‌ల్‌ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి 2020 క్యాలెండర్లు, డైరీలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తుల‌కు స‌కాలంలో అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.  గ‌త ఏడాది వ‌ర‌కు తిరుప‌తిలో మాత్ర‌మే క్యాలెండర్లు, డైరీల‌ స్టాక్ పాయింట్ ఉండేద‌ని, ఈ ఏడాది న్యూఢిల్లీ, ముంబాయి, బెంగుళూరు, చెన్నై, హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తిల‌లో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.  

టిటిడి క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న‌ భ‌క్తుల‌కు ఆయా స‌మీప నిల్వ కేంద్రాల నుండి స‌కాలంలో అందించాల‌ని, అందుకు అనుగుణంగా టిటిడి ఐటి, పోస్ట‌ల్ అధికారులు ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి సమాచార కేంద్రాలు, ముఖ్య నగరాల్లో క్యాలెండర్లు, డైరీల విక్ర‌యం, స్టాక్ నిల్వ, ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా పంపిణీ త‌దిత‌ర వివ‌రాల‌ను  ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సాప్ట్‌వేర్ రూపొందించాల‌ని ఐటి అధికారుల‌ను ఆదేశించారు. గ‌త అనుభ‌వాల దృష్టిలో ఉంచుకుని పంపిణీలో  సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా  నిర్ణీత వ్యవధిలో క్యాలెండర్లు, డైరీలు భక్తులకు చేరేలా టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విక్ర‌య‌ విభాగం, ఐటి, పోస్టల్‌ శాఖలు స‌మ‌న్వ‌యంతో  ప‌నిచేయాల‌ని సూచించారు.  

ఈ స‌మావేశంలో ప్ర‌చుర‌ణ‌ల విక్ర‌యం డెప్యూటీ ఈవో శ్రీ విజ‌య్‌కుమార్‌, ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, ఇడిపి ఒఎస్‌డి శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు నాయుడు, టిటిడి సమాచార కేంద్రాల అధికారులు, పోస్ట‌ల్ అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.