TTD DE-CENTRALISES ROOM ALLOTMENT PROCESS TO ONLINE DEVOTEES _ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న యాత్రికుల‌కు మ‌రింత సుల‌భ‌త‌రంగా గ‌దులు

Tirumala,19 April 2021: TTD has simplified procedures for easy access to rooms at Tirumala for devotees who made advanced online accommodation bookings.

TTD has now launched counters at Padala Mandapam and Tollgate at Alipiri and also at Srivari Mettu instead of the existing procedure at the CRO to scan the room receipts thereby decentralising the accommodation procedure.

At present, after scanning at CRO they had to visit the sub enquiry offices to get rooms leading to wastage of time and energy.

Following suggestions by devotees, TTD has changed the procedures to avoid unnecessary waiting at CRO. Devotees can now scan their advance/online booked rooms at the scanning counters at Alipiri toll gate (for vehicles), Srivari Mettu and Padala Mandapam at Alipiri (for foot walkers).

When they scan their receipts the devotees will get details of sub enquiry office they have to go on their registered mobile numbers so that devotees can directly visit and get rooms without wasting time at CRO.

Similarly, TTD is also mulling to de-centralise the CRO to six regions with 12 registration counters and allotment counters shifted to sub-enquiry offices of each rest houses, cottages etc. for the convenience of devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న యాత్రికుల‌కు మ‌రింత సుల‌భ‌త‌రంగా గ‌దులు

తిరుమల, 19 ఏప్రిల్‌ 2021: ఆన్‌లైన్‌లో ముంద‌స్తుగా బుక్ చేసుకున్న యాత్రికులు తిరుమ‌ల‌లో మ‌రింత సుల‌భ‌త‌రంగా గ‌దులు పొందేలా టిటిడి ప‌లు మార్పులు తీసుకొచ్చింది. ఇందుకోసం తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం, అలిపిరి టోల్‌గేట్‌, శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద గ‌దుల రిసిప్టుల స్కానింగ్ కేంద్రాల‌ను సోమ‌వారం ప్రారంభించింది. వీటితోపాటు సిఆర్‌వో జ‌న‌ర‌ల్ కార్యాల‌యంలో ఇదివ‌ర‌కే ఉన్న కౌంట‌ర్ల వ‌ద్ద కూడా గ‌దుల రిసిప్టులను స్కాన్ చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్‌లో గ‌దులు ముంద‌స్తు బుకింగ్ చేసుకున్న యాత్రికులు మొద‌ట సిఆర్వో కార్యాల‌యానికి వెళ్లి రిసిప్టులు స్కాన్ చేసుకుని అక్క‌డినుండి స‌బ్ ఎంక్వైరీ కార్యాల‌యానికి చేరుకుని గ‌దులు పొందుతున్నారు. దీనివ‌ల్ల స‌మ‌యం వృథా అవుతోంద‌ని ప‌లువురు యాత్రికులు అభిప్రాయ‌ప‌డ‌డంతో ఈ విధానంలో టిటిడి ప‌లు మార్పులు చేసింది. నూత‌న విధానంలో యాత్రికులు సిఆర్‌వో కార్యాల‌యానికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా చేశారు. తిరుప‌తి నుండి వ‌చ్చే కాలిన‌డ‌క‌న వ‌చ్చే యాత్రికుల కోసం అలిపిరి పాదాల మండ‌పం, శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద‌, వాహ‌నాల్లో వ‌చ్చే వారి కోసం అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద స్కానింగ్ కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. యాత్రికులు ఇక్క‌డ గ‌దుల రిసిప్టును స్కాన్ చేయించుకున్న కొంత స‌మ‌యంలోనే రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబరుకు స‌బ్ ఎంక్వైరీ కార్యాల‌య వివ‌రాలు పంపుతారు. త‌ద్వారా యాత్రికులు నేరుగా స‌బ్ ఎంక్వైరీ కార్యాల‌యానికి వెళ్లి గ‌దులు పొందే అవ‌కాశాన్ని క‌ల్పించారు.

అదేవిధంగా, త్వ‌ర‌లో తిరుమ‌ల‌లో సిఆర్వో కార్యాల‌యాన్ని వికేంద్రీక‌రించి ఆరు ప్రాంతాల్లో 12 రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్లు ఏర్పాటు చేయ‌నున్నారు. అలాట్‌మెంట్ కౌంట‌ర్ల‌ను స‌బ్ ఎంక్వైరీ కార్యాల‌యాల‌కు త‌ర‌లిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.