AYURVEDA SHOULD BECOME A COMPASS FOR THE WORLD- DR G SATHEESH REDDY_ ఆయుర్వేదంలో ప్రపంచానికి దిక్సూచిగా మారాలి : భారత రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి 

TIRUPATI, 23 MARCH 2023: The ancient medicine of Ayurveda should become a role model to the world in the field of Medicine in curing all sorts of ailments, said Dr G Satheesh Reddy, the Scientific Advisor, Ministry of Defense.

He visited SV Ayurveda College and Hospital on Thursday. Addressing the students on this occasion, he asked them to examine the treatment methods and principles of Ayurveda through western technology and show the superiority of India with new innovations.  Students are expected to understand Ayurveda with dedication and hard work.

Earlier, he paid a visit to the various wards including Panchakarma treatment, Ksharasutra process and other treatment methods and interacted with the patients who were undergoing treatment in the hospital.

Later he lauded the services of the doctors’, paramedical and office staff in both the hospital and at the college and also keeping the premises clean and hygienic.

Ayurveda College Principal Dr. Muralikrishna, Hospital Medical Superintendents Dr. Renu Dixit, Dr. Sundaram, Vice Principal Dr. Vijayabhaskar Reddy, Faculty Dr. Durga and students participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆయుర్వేదంలో ప్రపంచానికి దిక్సూచిగా మారాలి : భారత రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి

తిరుపతి, 2023 మార్చి 23: ఆయుర్వేద విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరిశోధనలు చేసి ప్రపంచానికి దిక్సూచిగా మారాలని భారత రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి ఆకాంక్షించారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిని గురువారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆయుర్వేదం చికిత్సా పద్ధతులను, సూత్రాలను పరిశీలించి నూతన ఆవిష్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని చెప్పాలని కోరారు. విద్యార్థులు అంకితభావంతో, త్రికరణశుద్ధిగా కృషిచేసి ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఆయుర్వేద విద్యార్థులు స్వయంగా అభివృద్ధి చెందడంతో పాటు సంస్థ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని కోరారు.

అంతకుముందు వైద్యశాలలోని పంచకర్మ చికిత్స, క్షారసూత్ర ప్రక్రియ తదితర చికిత్సా పద్ధతులను పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి చికిత్సల వల్ల కలిగిన ఉపశమనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి, కళాశాల పరిశుభ్రంగా ఉన్నాయని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్ సుందరం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ దుర్గ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.