AYURVEDA IS ULTRA MODERN- JEO _ ఆయుర్వేదం నిత్య నూత‌నం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirupati, 16 Dec. 19: Ayurveda is not only an ancient medicinal system but is also an ultra modern medical science with solutions for all critical ailments and diseases, said JEO Sri P Basant Kumar. 

The JEO inaugurated a six-day medical tutorial on the unique Ayurvedic treatment of Panchakarma at the Sri Venkateswara Ayurveda College in Tirupati on Monday.

As chief guest of the event, the JEO said that Ayurveda had attained public adoration and following. The medical tutorial programs like the present one will help practitioners in sharpening their medical skills.

He said as a part of its campaign to project and preserve the Vedic knowledge, culture, TTD had set up the Ayurvedic College and hospital.

Vice-chancellor of the SV Vedic Varsity Acharya Sannidhanam Sudarshana Sharma said Panchakarma was a unique traditional treatment of Ayurveda handed down by Vedic exponents in Medicine from times immemorial.

Head of the Panchakarma faculty in the SV Ayurveda Hospital Acharya P Muralikrishna said the tutorial program was designed in collaboration with the Ayush Ministry support of Government of India.

The principal of SV Ayurveda College Acharya A Shankar Babu, RMO Dr. Padmavathi Ayurveda exponents from 13 states, private practitioners, Doctors and students of the university participated in the event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

ఆయుర్వేదం నిత్య నూత‌నం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2019 డిసెంబరు 16: సనాతన వైద్యవిధానమైన ఆయుర్వేదం నిత్య నూత‌న‌మైంద‌ని, అన్ని కాలమాన ప‌రిస్థితుల్లో చ‌క్క‌టి ప్ర‌భావం చూపి వ్యాధుల‌ను న‌యం చేస్తుంద‌ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ ఆయుర్వేద కళాశాలలో ”పంచకర్మ”పై 6 రోజుల నిరంతర వైద్య విద్యా కార్యక్రమం సోమ‌వారం ప్రారంభ‌మైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ ప్రజలలో ఆయుర్వేద వైద్యానికి విశేష ఆదరణ ఉందన్నారు. ఇలాంటి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు వైద్యుల్లో వృత్తి నైపుణ్యాన్ని మ‌రింత పెంచుతాయ‌న్నారు. వేద సంస్కృతిని, సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించే క్ర‌మంలో టిటిడి ఆయుర్వేద క‌ళాశాల‌ను, వైద్య‌శాల‌ను ఏర్పాటు చేసింద‌న్నారు.

ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న‌శ‌ర్మ మాట్లాడుతూ ఆయుర్వేదాన్ని గురుప‌రంప‌ర‌గా భార‌తీయులు నేర్చుకున్నార‌ని తెలిపారు. ఇందులోని అనేక చికిత్సా ప్ర‌క్రియ‌లు విశేష ప్రాచుర్యం పొందాయ‌ని, వీటిలో పంచ‌క‌ర్మ ఒక‌టని వివ‌రించారు. ప‌లు చికిత్స‌ల‌ను ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. పంచ‌క‌ర్మ విభాగాధిప‌తి ఆచార్య పి.ముర‌ళీకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ స‌హ‌కారంతో వైద్యుల‌కు ఉప‌యుక్తంగా ఉండేలా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.శంకర్‌ బాబు, ఆర్ఎంఓ డా. ప‌ద్మావ‌తి, 13 రాష్ట్రాల నుండి వ‌చ్చిన వైద్యాధికారులు, ప్రయివేటు ప్రాక్టీష‌న‌ర్లు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.