REVIEW ON FREE LADDU PRASADAM DISTRIBUTION HELD _ ఉచిత ల‌డ్డూల పంపిణీపై స‌మీక్ష‌

Tirumala, 13 Jan. 20: A review meeting was held lead by Tirumala temple DyEO Sri Harindranath

to discuss on the distribution of free laddu prasadams to pilgrims which is soon to be implemented by TTD. 

The DyEO said arrangements were being made for free distribution of Srivari laddu to all devotees on both week days and peak days. All devotees of ₹300 special darshan ticket, Divya darshan, Sarva darshan etc will be given one free laddu.

He urged vigilance and IT officials to transparently coordinate efforts with Srivari Sevakulu and banks manning the laddu counters.

VSO Sri Manohar, temple peskar Sri Lokanatham, Potu Peshkar Sri Srinivasulu, AVSOs Sri Chiranjeevulu, Sri Gangaraju, IT and bank officials participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఉచిత ల‌డ్డూల పంపిణీపై స‌మీక్ష‌

తిరుమ‌ల‌, 2020 జనవరి 13: శ్రీ‌వారిని ద‌ర్శించుకునే భ‌క్తులంద‌రికీ త్వ‌ర‌లో ఉచితంగా ల‌డ్డూ పంపిణీకి సంబంధించిన విధి విధానాల రూప‌క‌ల్ప‌న‌పై శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ హ‌రీంద్ర‌నాథ్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం తిరుమ‌ల‌లోని పాత అన్న‌దానం కాంప్లెక్స్‌లో గ‌ల స‌మావేశ మందిరంలో స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా శ్రీ హ‌రీంద్ర‌నాథ్ మాట్లాడుతూ రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, దివ్య‌ద‌ర్శ‌నం, స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు ప‌ర్వ‌దినాల రోజుల్లో, సాధార‌ణ రోజుల్లో అంత‌రాయం లేకుండా ల‌డ్డూలు పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఇందుకోసం శ్రీ‌వారి ఆల‌యం, విజిలెన్స్‌, ఐటి అధికారులు స‌మ‌న్వయం చేసుకోవాల‌ని కోరారు. ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల‌న్నారు. ప‌లు బ్యాంకుల ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న కౌంట‌ర్లలో మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా సేవ‌లందించాల‌ని కోరారు.

ఈ స‌మావేశంలో టిటిడి విఎస్వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఆల‌య పేష్కార్ శ్రీ లోక‌నాథం, పోటు పేష్కార్ శ్రీ శ్రీ‌నివాసులు, ఏవిఎస్వోలు శ్రీ చిరంజీవులు, శ్రీ గంగ‌రాజు, ఐటి అధికారులు, ప‌లువురు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.