HEALTHY EMPLOYEES PROMOTE HEALTHY ORGANISATIONS -TTD JEO (H & E) _ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ పురోగతి – జెఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 28 July 2022: TTD JEO for Health and Education, Smt Sada Bhargavi said TTD undertook several welfare programs for its employees and advocated that healthy employees promoted the healthy functioning of the institution.

Addressing a Diabetes Awareness program for TTD employees at the SVETA Bhavan on Thursday, the JEO said that healthy employees could render more qualitative services to Srivari devotees.

She said as per the instructions of the EO, TTD organised diabetes awareness programs where they are provided information about all symptoms of the wellness ailment and advise them for early check ups and treatment after diagnosis.

She said a balanced diet, nutritious food was a basic ingredient for healthy life followed by daily exercises, yoga etc. All these together brings down sugar, BP etc. and given some inferences from her personal health habits.

Earlier sugar and diabetes experts from Apollo hospital, Hyderabad Dr Jayaprakash Sai explained how sugar and BP could be managed through diet and exercises.

Dr Radhika explained about Ragi nutrition. Food and food dynamics .Dr Vinay and Smt Shirisha of Sukshma Kria Yoga Foundation explained how it helps to manage Diabetes.

Thereafter the doctors teams conducted BP and Sugar tests to employees and gave valuable advises.

SVETA Director Smt Prashanti and other officials and TTD employees were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ పురోగతి- జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 2022 జూలై 28: టీటీడీ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చక్కగా విధులు నిర్వహించగలరని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జెఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు.

తిరుపతి శ్వేత భవనంలో బుధవారం టీటీడీ ఉద్యోగులకు డయాబెటిస్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శ్రీవారి భక్తులకు మంచి సేవలందించగలరన్నారు. ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి సూచన మేరకు ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా డయాబెటిస్ పై అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఉద్యోగుల హెల్త్ డేటాబేస్ లో వారి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం టీటీడీ పొందుపరచడం జరిగిందన్నారు. ఉద్యోగులు వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలవుతుందన్నారు. సమతుల్య ఆహారం , పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం దైనందిన జీవితంలో క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమని ఆమె తెలిపారు .

ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తూ ,సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ‌షుగర్‌, బిపి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా జెఈవో తన అనుభవాలను ఉద్యోగులతో పంచుకున్నారు.

అంతకుముందు హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ సాయి మాట్లాడుతూ ఆహార వ్యాయామాల ద్వారా షుగర్ నియంత్రించవచ్చని చెప్పారు. డాక్టర్ రాధికా రాగి న్యూట్రీషియన్ ఫుడ్, ఆహార నియమాలు తెలిపారు. డాక్టర్ వినయ్ డయాబెటిస్ వచ్చిన వారు చేయవలసిన వ్యాయామలు వారు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. సుష్మ క్రియ యోగ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమతి శిరీష డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి సుష్మక్రియ యోగ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిపారు.

అనంతరం వైద్యుల బృందం ఉద్యోగులకు బిపి షుగర్ పరీక్షలు నిర్వహించి, పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.