EVERY TTD ASSET BE UTILISED PROPERLY -TTD JEO (H&E)   _ ప్రతి ఆస్తి ఉపయోగంలోకి తేవాలి _ టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

EVERY TTD ASSET BE UTILISED PROPERLY -TTD JEO (H&E) 

 ·      PREPARE DETAILS FOR FINAL NOTIFICATION

 Tirupati, 28 July 2022: TTD JEO (H&E) Smt Sada Bhargavi has directed officials to take steps for the utilisation of every TTD asset prevalent across the country in a proper manner.

She conducted a review with AEOs, superintendents and case workers of TTD Estates, Properties, Revenue and Kalyana Mandapams on Thursday evening at the Sri Padmavati Rest House in Tirupati.

Speaking on the occasion TTD JEO recollected about the white paper on TTD assets published by the TTD Chairman Sri YV Subba Reddy in 2020.

She directed the Estate wing to get ready for the publication of a final notification after inspections by the special task forces led by OSDs reviewed whether the assets are being utilised by TTD or were encroached by others.

She directed the task forces in Tirupati, Vijayawada, Visakhapatnam and Hyderabad centres to complete their inspections on a war footing. They should also frequently inspect the Kalyana mandapams given on lease.

TTD Estates wing OSD Sri Mallikarjuna and other senior officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

ప్రతి ఆస్తి ఉపయోగంలోకి తేవాలి

– తుది నోటిఫికేషన్ ప్రకటించడానికి వివరాలు సిద్ధం చేయాలి

టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి  27 జూలై 2022: టీటీడీకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆస్తిని ఉపయోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం రాత్రి ఆమె ఎస్టేట్ శాఖ కు చెందిన ప్రాపర్టీ , రెవెన్యూ , కళ్యాణమండపాల విభాగాల ఎఈవోలు ,సూపరింటెండెంట్లు , కేస్ వర్కర్లతో సమీక్ష నిర్వహించారు .

ఈ సందర్బంగా శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ , 2020 లో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి టీటీడీ స్థిరాస్తులకు సంబంధించిన ముసాయిదా శ్వేత పత్రం
ప్రకటించిన విషయం గుర్తు చేశారు . ఇందులోని ప్రతి ఆస్తినిఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి నేతృత్వంలోని బృందాలు స్వయంగా పరిశీలించి అవి నిరుపయోగంగా ఉన్నాయా? ఆక్రమణలకు గురయ్యాయా? లీజులో ఉన్నాయా అనే పూర్తి వివరాలతో తుది నోటిఫికేషన్ ప్రకటించడానికి నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు వేగంగా తమ పని పూర్తి చేయాలని జెఈవో ఆదేశించారు. లీజుకు ఇచ్చిన కల్యాణ మండపాల నిర్వహణపై టాస్క్ ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలని ఆదేశించారు.
ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లిఖార్జున తో పాటు పలువురు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది