SEMINAR ON STUDENTS SECURITY _ ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థుల భద్రతపై సదస్సు 

TIRUPATI, 27 FEBRUARY 2023: An Awareness Programme on Students’  Security was held at SV Ayurvedic College in Tirupati.

SETWIN CEO Sri Murali Krishna who graced the event as the Chief Guest, in his address, said the various ill effects of using drugs, cybercrime, eve teasing and Disha Law. He cautioned the students to keep away from drugs as they would ruin their future and career. 

Disha Police Smt Swati and Smt Asha threw light on the incidents of Cyber Crime and alerted the students of the various frauds and how many students are destroying their lives by involving in eve teasing etc. They also informed them about the punishments in the legal system against the culprits when proved guilty, “Every girl student should download the Disha App on their mobiles for their personal safety”, they asserted.

SV Ayurvedic College Principal Dr Murali Krishna, faculty Dr Sundaram, Dr Venkatasivudu, Dr Raj Kumar, Dr Gopalakrishnaiah, Disha Police Smt Revati, Smt Swapna and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థుల భద్రతపై సదస్సు

తిరుపతి, 27 ఫిబ్రవరి 2023: ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో సోమవారం సాయంత్రం విద్యార్థుల భద్రతపై అవగాహన సదస్సు జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సెట్విన్ సీఈఓ శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల నష్టాలు, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, దిశా చట్టం తదితర అంశాల గురించి తెలియజేశారు. విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండాలని, సైబర్ క్రైమ్ మోసాలు, ముందు జాగ్రత్తలను ఉదాహరణలతో సహా వివరించారు.

దిశ పోలీస్ శ్రీమతి కె.స్వాతి మాట్లాడుతూ అంతర్జాలం ద్వారా జరుగుతున్న మోసాల వల్ల యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, స్మార్ట్ ఫోన్ జాగ్రత్తగా ఎలా వాడాలి అనే విషయాలను తెలియజేశారు. మరో పోలీస్ శ్రీమతి ఆశ మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ వల్ల జరిగే దుష్పరిణామాలు, విధించే శిక్షలను తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో కొత్త వ్యక్తులు తారసపడితే ఆచితూచి పరిచయం చేసుకోవాలన్నారు. దిశా యాప్ ను విద్యార్థినులందరూ డౌన్లోడ్ చేసుకొని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాలని, యాప్ ను వాడే విధానాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, అధ్యాపకులు డాక్టర్ సుందరం, డాక్టర్ వెంకటశివుడు, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ గోపాలకృష్ణయ్య, దిశా పోలీసులు శ్రీమతి రేవతి, శ్రీమతి స్వప్న ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.