PANCHAGAVYA PRODUCTS ON TTD APP-EO _ టీటీడీ యాప్ లో పంచగవ్య ఉత్పత్తుల సమాచారం -టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

TIRUPATI, 27 FEBRUARY 2023: The Panchagavya products by TTD which are already made available on the e-platform should also be made available on the new mobile app of TTD for the sake of devotees, said TTD EO Sri AV Dharma Reddy.

 

 

A review meeting on Panchagavya items and Parakamani was held at Sri Padmavathi Rest House in Tirupati on Monday. Speaking on the occasion, the EO directed the officials concerned to include the information on the TTD mobile app also which will reach more number of devotees. “10 out of 15 Panchagavya products have a huge demand from the masses. More publicity on the products is needed in this regard”, he added.

 

The EO also instructed the officials concerned to come out with more attractive photo frames of deities in Dry Flower Technology in all sizes.

 

Earlier, the EO also reviewed with various bankers over the status of Parakamani activities in Tirumala and in Tirupati and directed the officials concerned to ensure that there is no pending in the counting and accounting of currencies.

 

 

JEO for Health and Education, Smt Sada Bhargavi, FACAO Sri Balaji, AEO Parakamani Sri Rajendra were also present.

 
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టీటీడీ యాప్ లో పంచగవ్య ఉత్పత్తుల సమాచారం -టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

తిరుపతి 27 ఫిబ్రవరి 2023: టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తుల గురించి టీటీడీ వెబ్సైట్ లోనే కాకుండా ఇటీవల రూపొందించిన యాప్ లో కూడా సమాచారం పొందుపరచాలని ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సులువుగా చేరువ కావచ్చునని ఆయన తెలిపారు.

తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. 15 రకాల పంచగవ్య ఉత్పత్తుల్లో 10 ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధికారులు ఈవో దృష్టికి తెచ్చారు. వీటిని మరింత ఎక్కువగా వినియోగదారులకు చేరవేయడానికి ,ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో చెప్పారు.టీటీడీ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న ఫొటో ఫ్రేమ్ లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. వివిధ సైజులు, ఫ్రేమ్ లతో తయారు చేసిన వాటి వెనుక వైపు ఈ ఉత్పత్తి గురించిన పవిత్రత, ప్రాముఖ్యతను అర్థమయ్యేలా ముద్రించాలన్నారు. వీటిపై గణాంక శాఖ అధికారులు సమీక్ష చేయాలని ఈవో సూచించారు.

అంతకు ముందు తిరుమల , తిరుపతిలో పరకామణి అంశంపై ఈవో సమీక్ష జరిపారు. నాణాలు వివిధ బ్యాంకులకు క్రమ పద్దతిలో పంపే ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకులు ఏ రోజు నాణాలు ఆరోజు తీసుకుని వెళ్ళేలా ఉన్న వ్యవస్థను మరింత ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని శ్రీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. నాణాలు నిల్వ ఉండకుండా ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.

జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ ఎ సీఏవో శ్రీ బాలాజి, పరకామణి ఎఈవో శ్రీ రాజేంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది