SV AYURVEDA STUDENT BAGS AWARD _ ఎస్వీ ఆయుర్వేద విద్యార్థినికి ఉత్తమ శోధపత్ర పురస్కారం- అభినందించిన జెఈవో శ్రీమతి సదా భార్గవి

* TTD JEO (H&E) PRESENTS UTTAMA SHODAPATRA AWARD

 

Tirumala,04 March 2023: TTD JEO (Health and Education) Smt Sada Bhargavi on Saturday complimented Dr T Sirigeeta, a Research Associate and student of SV Ayurveda College who bagged “Uttama Shodapatra”(Best Research Paper) award.

 

Dr Sirigeeta a 2nd year PG student of the college had received the unique award for her research paper on Ayurvedic medicine for the prevention of the pandemic covid-19 presented at the international conference held between February 23-25 at the deemed University of Rashtriya Ayurveda Samsthan, at Jaipur, Rajasthan.

 

Her paper was presented at a conference attended by over 500 Ayurvedic experts focused on the scope of ayurvedic medicine in future.

 

College Principal Dr P Muralikrishna, HOD Dr Durga, Associate Professor Dr Ramesh Babu and others were present.

 
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ ఆయుర్వేద విద్యార్థినికి ఉత్తమ శోధపత్ర పురస్కారం

– అభినందించిన జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 2023 మార్చి 04: ఉత్తమ శోధపత్ర పురస్కారం పొందిన ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థిని డాక్టర్‌ టి.సిరిగీతను టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి శనివారం తమ కార్యాలయంలో అభినందించారు.

ఫిబ్రవరి 23 నుండి 25వ తేదీ వరకు రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని రాష్ట్రీయ ఆయుర్వేద సంస్థాన్‌`మానిత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆయుర్వేద ఔషధోత్పత్తి శాస్త్రానికి సంబంధించి అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలోని రసశాస్త్ర`భైషజ్యకల్పన విభాగానికి చెందిన పిజి రెండో సంవత్సరం విద్యార్థిని డా. టి.సిరిగీత ఈ సదస్సులో పాల్గొన్నారు. ‘‘కోవిడ్‌`19 మహమ్మారి నివారణకు ఆయుర్వేద ఔషధాలు’’ అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. ఇందులో ఆయుర్వేద ఔషధ తయారీ రంగానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని తెలియజేశారు. ఇందుకు గాను ఆయుర్వేద నిష్ణాతుల చేతులమీదుగా ఉత్తమ శోధపత్ర పురస్కారం అందుకున్నారు. 500 మందికిపైగా ఆయుర్వే నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

డాక్టర్‌ టి.సిరిగీతకు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.మురళీకృష్ణ, విభాగాధిపతి డాక్టర్‌ శ్రీదుర్గ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమేష్‌బాబు తదితరులు అభినందనలు తెలియజేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.