TTD BOARD TO CONSIDER DEGREE COURSES FOR SV DEAF & DUMB STUDENTS- TTD EO _ ఎస్వీ బ‌దిర పాఠ‌శాలలో డిగ్రీ కోర్సులు అంశాన్ని బోర్డులో చ‌ర్చిస్తాం : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati, 1 Jan. 22: TTD EO Dr KS Jawahar Reddy on Saturday said that TTD Board will review the feasibility of commencing Degree courses at the SV Deaf and Dumb school.

 

He said the difficulties of students after inter course has come to his notice and hence the TTD board will review the feasibility of starting degree courses for them.

 

Earlier the TTD EO visited the SV School for D&D and interacted with students.

 

Speaking on the occasion the EO said the special school is already providing teaching from 1st standard to inter courses for the challenged children.

 

Assuring to consider starting of degree courses after review at the board meeting, the EO directed officials to prepare an action plan for development activities in the school.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ బ‌దిర పాఠ‌శాలలో డిగ్రీ కోర్సులు అంశాన్ని బోర్డులో చ‌ర్చిస్తాం : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 01: తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర బ‌దిర పాఠ‌శాల విద్యార్థులు ఇంట‌ర్ త‌రువాత పై చ‌దువుల కోసం ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, ఇక్క‌డ డిగ్రీ కోర్సులు ప్ర‌వేశ‌పెట్టే అంశాన్ని రానున్న బోర్డు స‌మావేశంలో చ‌ర్చిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. ఎస్వీ బ‌దిర పాఠ‌శాలను శ‌నివారం ఈవో సంద‌ర్శించారు. పాఠ‌శాల విద్యార్థుల‌తో ముచ్చ‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ పాఠ‌శాల‌లో 1 నుండి ఇంట‌ర్ వ‌ర‌కు బోధ‌న జ‌రుగుతోంద‌న్నారు. డిగ్రీ కోర్సుల ప్రారంభానికి సంబంధించి బోర్డులో చ‌ర్చించి స‌ముచిత‌మైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. పాఠ‌శాల‌లో మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌న్నారు. అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.