TTD JEO (HEALTH & EDUCATION) INSPECTS SV SCULPTURE COLLEGE _ ఎస్వీ శిల్ప క‌ళాశాల‌ను పరిశీలించిన జెఈవో (విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 14 Oct. 20: TTD JEO (Health and Education) Smt Sada Bhargavi on Wednesday inspected the SV Sculpture College and SV Technical Institute for handicapped and directed the officials concerned to improve student facilities and promote more admissions in all courses.

During her visit to the SV Sculpture College she went around the granite, metal, Wooden, cement and colour units and instructed the officials to strive to attract more students particularly in Kalamkari section.

She also visited the fitter, Turner sections and inspected kitchen and hostel facilities of the Handicapped Training Centre and given valuable suggestions to officials.

SE (Electrical) Sri Venkateswarlu, SE 1 Sri Jagadeeshwar Reddy, DEO Sri Ramana Prasad, Additional Health officer Dr Sunil Kumar, Sculpture college Principal Sri Venkat Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ శిల్ప క‌ళాశాల‌ను పరిశీలించిన జెఈవో (విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

తిరుపతి, 2020 అక్టోబర్ 14: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల, ఎస్వీ  విక‌లాంగుల శిక్ష‌ణ కేంద్రం ‌(ఐటిఐ)ను బుధ‌వారం జెఈవో (విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి పరిశీలించారు.

అలిపిరి వ‌ద్ద ఉన్న ఎస్వీ శిల్ప క‌ళాశాలలో విద్యార్థుల‌కు అందుతున్న సౌక‌ర్యాలు,  శిక్ష‌ణ కోర్సులు, ప్ర‌ద‌ర్శ‌న శాల‌ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం క‌ళాశాల‌లోని సంప్ర‌దాయ రాతి, లోహ‌, చెక్క‌, సిమెంటు, వ‌ర్ణ  విభాగాల‌ను పరిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. క‌లంకారి కోర్సుల‌లో విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

అనంత‌రం ఎస్వీ విక‌లాంగుల శిక్ష‌ణ కేంద్రం‌‌లోని (ఐటిఐ) ఫిట్ట‌ర్‌, ట‌ర్న‌ర్‌ త‌దిత‌ర విభాగాల‌ను, వంట గ‌దిని, హాస్ట‌ల్ భ‌వ‌నం ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

జెఈఓ వెంట ఎస్ ఇ (ఎల‌క్ట్రిక‌ల్‌) శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, డిఈవో  శ్రీ ర‌మ‌ణ ప్ర‌సాద్ , ఇఇ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఆరోగ్య శాఖ అధికారి డా. సునీల్ కుమార్‌‌, శిల్ప క‌ళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వెంక‌ట రెడ్డి ఉన్నారు.
           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.