LIST OF RELIGIOUS EVENTS IN KRT _ ఏప్రిల్‌లో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

TIRUPATI, 29 March 2022: The following are the list of festivities lined up in Sri Kodanda Rama Swamy temple in Tirupati in the month of April

April-2, 9,16, 23,30-Abhishekam to mula virat

April 2: Subhakrutnama Ugadi Asthanam

April 10: Sri Rama Navami Asthanam

April 11: Sita Rama Kalyanam

April 12: Sri Rama Pattabhishekam

April 13: Khanija Tototsavam

April 14-16: Teppotsavams in Ramachandra Pushkarini

April 16: Astottara Satakalashabhisekam

April 30: Sahasra Kalasabhishekam

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్‌లో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2022 మార్చి 29: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

–  ఏప్రిల్ 2, 9,16, 23, 30వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

–  ఏప్రిల్ 2వ తేదీ మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఉగాది ఆస్థానం నిర్వ‌హిస్తారు.

–   ఏప్రిల్ 10న సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.  

–   ఏప్రిల్ 11న రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం వైభ‌వంగా జ‌రుగ‌నుంది. అనంత‌రం బంగారు తిరుచ్చిపై స్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

–    ఏప్రిల్ 12న రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌రామ ప‌ట్టాభిషేకం నిర్వ‌హిస్తారు. త‌రువాత‌ బంగారు తిరుచ్చిపై స్వామివారు క‌టాక్షిస్తారు.

–    ఏప్రిల్ 13న సాయంత్రం 4.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు ఖ‌నిజ తోట ఉత్స‌వం, ఆస్థానం నిర్వ‌హిస్తారు.

–     ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు శ్రీ రామ‌చంద్ర పుష్క‌రిణిలో శ్రీ సీత ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారు తెప్ప‌పై  భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

–    ఏప్రిల్ 16వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 9.00 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది.

–   ఏప్రిల్ 30వ తేదీ అమావాస్యనాడు ఆలయంలో ఉదయం 6.00 గంటలకు  సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రాత్రి 7 గంట‌లకు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.