MAHATI PROGRAMS ALLURE AUDIENCE _ మ‌హ‌తిలో ఆకట్టుకున్న డా.ఉషారాణి కూచిపూడి నృత్యం

TIRUPATI, 29 MARCH 2022: The Kuchipudi dance ballet was performed by the artists team led by Dr Usha Rani of SV College of Music and Dance at Mahati Auditorium on the occasion of the 519th Vardhanti of Saint Poet Sri Tallapaka Annamacharya mused the Tirupatites on Tuesday evening.

 

Earlier the Mangaladhwani and the vocal concert also impressed the audience.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మ‌హ‌తిలో ఆకట్టుకున్న డా.ఉషారాణి కూచిపూడి నృత్యం

తిరుపతి‌, 2022 మార్చి 29: పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి సందర్భంగా మంగ‌ళ‌వారం సాయంత్రం మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు డాక్టర్ ఎస్. ఉషారాణి కూచిపూడి నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి సుప్రభాతం మొదలుకొని, తోమాల, అర్చన, ఏకాంత సేవ, బ్రహ్మోత్సవాలు ఇలా స్వామివారి వైభవాన్ని కీర్తించిన పలు అన్నమయ్య కీర్తనలకు డా.ఉషారాణి బృందం అత్యంత నయన మనోహరంగా కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులు తన్మయత్వంతో భక్తి పరవశులైనారు.

అంత‌కుముందు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి ర‌విప్ర‌భ‌, శ్రీ‌మ‌తి ఈశ్వ‌ర‌మ్మ‌ బృందం మంగ‌ళ‌ధ్వ‌ని, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వైజాగ్‌కు చెందిన శ్రీ చైత‌న్య బ్ర‌ద‌ర్స్ బృందం సంగీత స‌భ నిర్వ‌హించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.