TTD TO RESUME ARJITA SEVAS FROM APRIL 1 _ ఏప్రిల్ 1వ తేదీ నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు

Tirumala, 7 Mar. 22: TTD has decided to resume all the Arjita Sevas in the Hill Shrine of Tirumala from April 1 onwards.

It may be mentioned here that after a span of two years, the Arjita Sevas are set to resume in Tirumala temple which were stopped from March 20 in 2020 following Covid Pandemic.

From April 1 onwards, Suprabhatam, Tomala, Archana, Astadala Pada Padmaradhana, Tiruppavada, Melchat Vastram, Abhishekam, Kalyanotsavam, Dolotsavam, Arjita Brahmotsavam and Sahasra Deepalankara Sevas will be observed in Tirumala temple.

The system of Arjita Sevas will continue as they used be earlier before Corona Pandemic.

Besides, the system of virtual sevas will also continue but the devotees who booked arjita sevas will be provided darshan alone and cannot take part in sevas directly.

The devotees who booked arjita sevas in advance booking, Udayastamana Sevas and Vimshati Varsha Darshini ticket holders will be allowed for Arjita Sevas from April 1 onwards following Covid norms.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్ 1వ తేదీ నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు

తిరుమ‌ల‌, 2022 మార్చి 07: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించి భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లు నిర్వ‌హిస్తారు.

కోవిడ్‌-19 ప‌రిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగుతుంది.

అదేవిధంగా, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతోపాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా కొన‌సాగుతుంది. వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదు. వారికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంతోపాటు ప్ర‌సాదాలు అందించ‌డం జ‌రుగుతుంది.

అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్త‌మాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమ‌తిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.