SRI RAMA NAVAMI ASTHANAM AT SRIVARI TEMPLE ON APRIL 10 _ ఏప్రిల్ 10న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

SRI RAMA PATTABHISHEKAM ON APRIL 11

Tirumala, 07 April 2022: TTD is organising a grand fete of Asthanam at Srivari temple on April 10 as part of Sri Rama Navami celebrations followed by Hanumanta vahana seva at night. Similarly, an imposing fete of Sri Rama Pattabhisekam will be conducted on April 11.

In this connection a holy ritual of Snapana Tirumanjanam would be performed for the utsava idols of Sri Sita Rama Lakshmana sameta Hanumanta on Sunday at Ranganayakula Mandapam.

Same night the Sri Ramanavami Asthanam will be performed at the Bangaru vakili inside the Srivari temple.

In view of annual celebrations the TTD has cancelled the Sahasra Deepalankara seva on Sunday evening.

However, the utsava idols of Sri Sita Rama Lakshmana sameta Hanumanta will be rendered the Sahasra Deepalankara seva on April 11.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 10న  శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

ఏప్రిల్ 11న‌ శ్రీరామపట్టాభిషేకం

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 07: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు  శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 11న శ్రీరామ పట్టాభిషేకం నిర్వ‌హిస్తారు.

ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఆ త‌రువాత రాత్రి  10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

ఏప్రిల్ 11న సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స‌హ‌స్ర‌దీపాలంకార సేవ జ‌రుగుతుంది. రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.