RAMANUJACHARYA AVATAROTSAVAMS  _ ఏప్రిల్ 23 నుంచి 25వ తేదీ వరకు భగవద్‌ రామానుజాచార్యుల 1008వ అవతార మహోత్సవాలు

TIRUPATI, 22 APRIL 2023: In connection with the 1008th Avatarotsavam of the great Sri Vaishnava Saint Sri Ramanujacharya, a three day programme has been mulled by TTD between April 23 and 25 in Tirupati.

 

The three-day festivities will be observed at Annamacharya Kalamandiram between 6pm and 8:30pm on these days which includes literary programs and Sankeertans.

 

The programme commences with the Anugraha Bhashanam of both the seers of Tirumala.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 23 నుంచి 25వ తేదీ వరకు భగవద్‌ రామానుజాచార్యుల 1008వ అవతార మహోత్సవాలు

తిరుపతి, 2023 ఏప్రిల్ 22: అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల 1008వ అవతార మహోత్సవాలు జరుగనున్నాయి.

ఈ సంద‌ర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఏప్రిల్ 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి అనుగ్రహభాషణంతో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి . అనంతరం తిరుప‌తికి చెందిన ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగనాథన్‌ ” శ్రీ రామానుజ వైభవం” పై ఉపన్యసిస్తారు. త‌రువాత తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి రేవ‌తి బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.