SAMA VEDA PARAYANAM FROM MAY 1 _ మే 1 నుంచి శ్రీవారి ఆలయంలో సామవేద(కౌతమ) పారాయణం 

TIRUMALA, 22 APRIL 2023: The Sama Veda Parayanam (Koutuma) will commence in Tirumala on May 1 onwards.

 

This will last up to June 30th. Six batches of Vedic scholars will render this at Ranganayakula Mandapam in Tirumala temple every day between 9am and 10am.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 1 నుంచి శ్రీవారి ఆలయంలో సామవేద(కౌతమ) పారాయణం

తిరుమల, 22 ఏప్రిల్ 2023: తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న చతుర్వేద పారాయణ యజ్ఞంలో భాగంగా మే ఒకటో తేదీ నుంచి సామవేద(కౌతమ) పారాయణం ప్రారంభం కానుంది. జూన్ 30వ తేదీ వరకు ఈ పారాయణం జరుగనుంది. ఒక్కో బృందంలో 13 మంది చొప్పున మొత్తం ఆరు బృందాల్లో పండితులు పారాయణం చేస్తారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఈ పారాయణం జరుగుతోంది.

కరోనా మహమ్మారి నుండి మానవాళిని రక్షించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ 2020 ఏప్రిల్ నుండి ఆలయంలో పారాయణం జరుగుతోంది. 2022 సెప్టెంబర్ 4 నుండి 2023 జనవరి 31 వరకు కృష్ణయజుర్వేద పారాయణం చేపట్టారు. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 31వ తేదీ వరకు ఋగ్వేద పారాయణం జరుగుతోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.