TALABRALU PACKING COMMENCES _ ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం 

TIRUPATI, 30 MARCH 2023: In connection with Sri Sita Rama Kalyanam as part of the annual brahmotsavam of Sri Kodanda Ramalayam at Vontimitta in YSR Kadapa district, the packing of Talambralu commenced on Thursday.

About 250 Srivari Sevaks are being deployed for packing 1.75lakh packets of Talambralu.

SVETA Director Smt Prasanthi, AEO Sri Devarajulu are supervising the arrangements.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం
 
ఒంటిమిట్ట, 2023 మార్చి 30: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 5న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో గురువారం తలంబ్రాల తయారీని ప్రారంభించారు.
 
ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి కలిసి డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబుకు అందజేశారు. అక్కడినుండి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 350 మంది శ్రీవారి సేవకులు 1.75 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.
 
ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ దేవరాజులు తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.