KOIL ALWAR TIRUMANJANAM HELD AT VONTIMITTA _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 28 MARCH 2023: In connection with the annual brahmotsavams starting at Sri Kodandarama Swamy temple in Vontimitta, the traditional temple cleansing ritual, Koil Alwar Tirumanjanam was held in the temple on Tuesday.

This event was held between 8am and 11:30am. After that devotees are allowed for darshan.

Temple DyEO Sri Natesh Babu, Temple Inspector Sri Dhananjeyulu and others were present.

Brahmotsavam details:.

Everyday the morning Vahana Sevas will be between 8am and 10am while the evening Vahana Sevas between 7pm and 9pm.

March 30: Ankurarpanam

March 31: Dhwajarohanam in Vrishabha Lagnam

April 01: Venugana Alankaram, Hamsa Vahanam

April 02: Vatapatrasai Alankaram, Simha Vahanam

April 03: Navaneetakrishna Alankaram, Hanumatseva

April 04: Mohini Alankaram, Garuda Seva

April 05: Sivadhanurbhangalankaram, Sri Sita Rama Kalyanam, Gaja Vahanam

April 06: Rathotsavam

April 07: Kaliyamardana Alankaram, Asva Vahanam

April 08: Chakra Snanam, Dhwajavarohanam

April 09: Pushpayagam

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 28మార్చి 2023: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 31 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధ‌నంజ‌యులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వాహన సేవలు :

తేదీ ఉదయం సాయంత్రం

31-03-2023 ధ్వజారోహణం(వృషభలగ్నం) శేష వాహనం

01-04-2023 వేణుగానాలంకారము హంస వాహనం

02-04-2023 వటపత్రశాయి అలంకారము సింహ వాహనం

03-04-2023 నవనీత కృష్ణాలంకారము హనుమత్సేవ

04-04-2023 మోహినీ అలంకారము గరుడసేవ

05-04-2023 శివధనుర్భంగాలంకారము కళ్యాణోత్సవము/ గజవాహనము

06-04-2023 రథోత్సవం ———–

07-04-2023 కాళీయమర్ధనాలంకారము అశ్వవాహనం

08-04-2023 చక్రస్నానం ధ్వజావరోహణం.

ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.