GANGA PUJA PERFORMED AT KT _ కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా గంగపూజ

కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా గంగపూజ

తిరుపతి, 2020 న‌వంబరు 25: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయం వద్దగల పుష్కరిణిలో బుధ‌‌వారం ఉద‌యం గంగపూజ జరిగింది.

ఇందులో భాగంగా గంగమ్మకు పుసుపు కుంకుమ, హారతి సమర్పించారు. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.

అంతకుముందు టిటిడి వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా గల శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల నుంచి కలశం ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుంది. టిటిడి వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏటా గంగపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

స్వీమ్స్‌లో ఆయుధ‌పూజ –

టిటిడి వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వ‌ర్యంలో స్వీమ్స్‌లో ఆయుధ‌పూజ నిర్వ‌హించారు.
 
ఈ కార్యక్రమంలో ఎస్ ఇ -1 శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌ పాల్గొని, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీ మ‌నోహ‌ర్‌, డెప్యూటీ ఇఇలు శ్రీ ల‌క్ష్మ‌ణ‌బాబు, శ్రీ పురుషో‌త్తం, శ్రీ సుధాక‌ర్‌, ఇతర వాటర్‌ వర్క్స్‌ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.                    

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 

Tirupati, 25 Nov. 20: The water works wing of TTD has performed Ganga Puja at Sri Kapileswara Swamy temple in the sacred waters of temple tank- Kapila Theertham.

Vermilion, turmeric were offered and special Harati was rendered.

Ealier, the holy Kalasa was carried to the temple from SGS High School in a procession.

Every year, the water works wing of TTD performs Ganga Puja as a thanks giving gesture to Goddess Ganga for good rains.

The water wing also performed Ayudha Puja at SVIMS super speciality hospital.

SE 3 Sri Satyanarayana, EE Manohar, DyEEs Sri Lakshmana Babu, Sri Purushottam, Sri Sudhakar and other staffs also participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI