MAHA SAMPROKSHANAM CONCLUDES _ అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో ముగిసిన మహాసంప్రోక్షణ

Tirupati, 25 Nov. 20: The ritual of Maha Samprokshanam in Sri Lakshmi Narayana Swamy temple concluded on Wednesday at Alipiri.

As part of it homes were conducted between 7:30 a.m. and 9 a.m. Later in the auspicious Dhanur Lagnam between 9 a.m. and 10:30 a.m., rituals like Kumbharchana and Maha samprokshanam were conducted to Sri Lakshmi Narayana Swamy and other Parivara Devatas and concluded with Maha Purnahuti.

With this, the five-day religious event of Astabandhana Balalaya Maha Samprokshanam concluded.

Agama Advisor Sri NAK Sundaravaradan, Spl.Gr.DyEO Sri Rajendrudu and other staffs were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో ముగిసిన మహాసంప్రోక్షణ

తిరుపతి, 2020 న‌వంబరు 25: అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో  బుధ‌వారం మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉద‌యం 7.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హోమాలు, ఉద‌యం 9 నుండి 10.30 గంట‌ల మ‌ధ్య మ‌హా పూర్ణాహూతి,  ధ‌నుర్ ల‌గ్నంలో  శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ స్వామి, ప‌రివార దేవ‌త‌ల‌కు కుంభ‌ర్చాన, మ‌హా సంప్రోక్ష‌ణ‌  కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఆలయంలో ఐదు రోజుల పాటు బాలాలయ జీర్ణోద్ధరణ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజు  పూర్ణాహుతితో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ముగిసింది.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ రాజేంద్రుడు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ సుందరవరద భట్టాచార్యులు, ఏఈవో శ్రీ రవికుమార్, కంకణభట్టార్ శ్రీ మురళీ కృష్ణ ఆచార్యలు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఆర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.