కరెంట్‌బుకింగ్‌ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు

కరెంట్‌బుకింగ్‌ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు

తిరుమల, జనవరి -20,2011: తిరుమలలో భక్తుల సౌలభ్యం కొఱకై ఏర్పాటు చేసిన కరెంట్‌బుకింగ్‌ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలను ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగిస్తారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ ద్వారా, అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా, కరెంట్‌ బుకింగ్‌ పద్దతుల ద్వారా శ్రీవారి ఆర్జితసేవాటిక్కెట్లను భక్తులకు మంజూరు చేస్తుండడం విధితమే. అయితే కరెంట్‌ బుకింగ్‌ ద్వారా ఇస్తున్న ఆర్జితసేవాటిక్కెట్ల విషయంలో భక్తులనుండి కొంత అసంతృప్తి ఉన్నట్లు గమనించి ఈ కరెంట్‌బుకింగ్‌ కోటాను కొనసాగించే విషయాన్ని తితిదే పరిశీలిస్తున్నది. నిత్యం నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జితబ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణసేవలు, వారపుసేవలైన విశేషపూజ, అష్టదళపాదపద్మారాధనసేవ, సహస్రకలశాభిషేకం, తిరుప్పావడ తదితరసేవలన్నీ ప్రస్తుతానికి కరెంట్‌ బుకింగ్‌ ద్వారా భక్తులకు ఇవ్వడం జరుగుచున్నది.

 అయితే ఈ కరెంట్‌ బుకింగ్‌ విధానాన్ని కొనసాగించడమా లేదా మార్పులు చేయడమా అన్న విషయాన్ని త్వరలో భక్తులకు తెలియజేస్తాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.