CORONA MOTHERS CAN FEED MILK TO CHILDREN- RUIA HOSPITAL SUPERINTENDENT DR BHARATI _ కరోనా సోకినా బిడ్డకు పాలు ఇవ్వచ్చు

AT TTD WOMEN EMPLOYEES AWARENESS PROGRAM

 Tirupati, 3 Sep. 20: Mothers tested corona positive after delivery, could still feed the newborn, Ruia Hospital Superintendent Dr Bharati on Thursday.

Addressing an online corona awareness campaign program organised by the SVETA (Sri Venkateshwara Employees Training Academy) Dr Bharati said mother’s milk was a major source of strength to infants.

She urged the women employees to take all precautions in the Covid-19 environment and that any symptoms viz.mild cold cough, sour throat, breathlessness should not be ignored and immediately consult doctors and treatments.

Dr Bharati said even if women are affected by Corona at 8-9 months pregnancy, the newborn babies would not be affected but better get corona tests done for the babies as well.

The lactating mothers should wash their hands with soaps and sanitizers and clean their breasts before breast-feeding the babies.

The pregnant ladies should avoid lime juices, but drink hot water and also take Kashayam with garlic, jaggery, pepper boiled in water once in a day at 50 ml per dose.

They should also consume Vitamin C B complex and Zinc tablets daily as per Doctors’ suggestion and working women should wear masks when they go out, wash their hands and feet before mixing with family members.

She clarified many doubts raised by employees from different offices and advised that even when in office they should often clean hands with sanitizers.

SVETA Director Sri Ramanjulu Reddy said online corona awareness and training programs are being conducted for TTD employees from July 27th at a rate of 70 persons per day especially for women employees on Thursdays.

Dr Janardan Rao and AEO Smt Jagadeswari participated in the training cum awareness program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కరోనా సోకినా బిడ్డకు పాలు ఇవ్వచ్చు.

టీటీడీ మహిళా ఉద్యోగుల అవగాహన కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి

తిరుపతి 3 సెప్టెంబరు2020: ప్రసవం అనంతరం తల్లికి కరోనా పాజిటివ్ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని బిడ్డకు పాలు ఇవ్వచ్చని రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి చెప్పారు. ఏసమయంలో అయినా తల్లి పాలు బిడ్డకు శక్తిని ఇస్తాయన్నారు.

శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ ( శ్వేత) ఆధ్వర్యంలో గురువారం ఆ కార్యాలయం నుంచి టీటీడీ మహిళా ఉద్యోగులకు ఆన్ లైన్ ద్వారా కరోనా అవగాహన కార్యకమం నిర్వహించారు.

డాక్టర్ భారతి ఉద్యోగులకు తగిన జాగ్రత్తలు, కోవిడ్ 19 (కరోనా) అవగాహన అంశాలను వివరించారు. గర్భవతులు జలుబు, దగ్గు, గొంతునొప్పి , శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. గర్భిణికి 8 లేదా 9వ నెలలో కరోన వస్తే బిడ్డకు ఇబ్బంది ఉండదన్నారు. ప్రసవం తర్వాత బిడ్డకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని చెప్పారు. ప్రసవం తర్వాత తల్లి తన చేతులు సబ్భుతో గానీ, శానిటైజర్ తోగానీ , స్థనాలను నీటితో బాగా శుభ్రం చేసుకుని, మాస్క్ వేసుకుని బిడ్డకు పాలు ఇవ్వాలన్నారు. గర్భవతులు వేడినీరు బాగా తాగాలన్నారు. అల్లం, బెల్లం, మిరియాలు ఉడికించిన కషాయం రోజుకు ఒకసారి 50 మిల్లీ లీటరు తాగితే మంచిదని, నిమ్మకాయ రసం తాగరాదని తెలిపారు.

సి విటమిన్, బి కాంప్లెక్స్, జింక్ మాత్రలు డాక్టర్ సూచన మేరకు రోజూ తీసుకోవాలని సూచించారు. ఉత్త నీటితో కూడా ఆవిరి పట్టుకోవచ్చని చెప్పారు. మహిళా ఉద్యోగులు ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే చేతులు, కాళ్ళు బాగా కడుక్కుని, మాస్క్ తీసి వేశాకే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లాలని సలహా ఇచ్చారు. ఆఫీసులో ఉన్నప్పుడు తరచూ చేతులు శానిటైజ్ చేసుకుంటూ, మాస్క్ తప్పని సరిగా ధరించాలని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు అడిగిన అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

శ్వేత డైరెక్టర్ శ్రీ రామాంజులు రెడ్డి మాట్లాడుతూ జులై 27వతేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా రోజూ 70 మంది ఉద్యోగులకు శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రావు, ఏఈఓ శ్రీమతి జగదీశ్వరి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది