ADDITIONAL EO REVIEWS ON DEVELOPMENT WORKS AT DHARMAGIRI _ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అభివృద్ధి పనులపై టిటిడి అదనపు ఈవో సమీక్ష

Tirumala, 3 Sep. 20: The improvement and repair works to be taken up at Veda Vignana Peetham are reviewed in the Vedagiri premises in Tirumala on Thursday.

Speaking during the review meeting, the Additional EO said all facilities will be provided at the Peetham to ensure high standards of Vedic learning and teaching. “We will resolve all your problems but you should ensure the best environment to the pupils in Vedic learning”, he told Vedic teachers.

Ahead of the commencement of classes in a month he directed TTD officials to complete all pending works related to Veda Pathashala.

He said strict vigilance has to be maintained against the entry of outsiders during the corona period.  In view of its location in the deep forest belt, the TTD Forest and Garden department officials were instructed to take up necessary measures.

He directed the Health officials to take steps to avoid stagnant waters and cleanup operations. He also said all other issues, if any like street lighting, water pumping, electrical wiring, civil repair works etc. should be taken up on a fast pace. 

The Additional EO said all the issues shall be brought to the notice of the Administrative Officer of Pathashala and DyEO Sri Vijaya Saradhi for fast resolution.

Veda Pathashala Principal Sri Kuppa Shiv Subramanya Avadhani, TTD SE-2 Sri Nageswar Rao, EE Sri Jaganmohan Reddy, FMS EE Sri Mallikarjun Prasad, DE Smt Saraswati, VGO Sri Manohar, Health Officer Dr RR Reddy, DFO Sri Chandrasekhar, Deputy Director of Garden department Sri Srinivasulu and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అభివృద్ధి పనులపై టిటిడి అదనపు ఈవో సమీక్ష
 
తిరుమల, 2020 సెప్టెంబరు 03: తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గురువారం వేద పాఠశాల ప్రాంగణంలో సమీక్ష నిర్వహించారు. ముందుగా పూజా కార్యక్రమంలో అదనపు ఈఓ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా అదనపు ఇఓ మాట్లాడుతూ అధ్యాపకులు వేదవిద్యా బోధనలో భారతదేశంలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దాలని, విద్యార్థులను ప్రతిభావంతమైన వేదపండితులుగా తయారు చేయాలని అన్నారు. అందుకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తామని చెప్పారు. మరో నెల రోజులలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో బయటి వ్యక్తులు  ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. అటవీ ప్రాంతం కావడంతో టీటీడీ, ఉద్యానవన విభాగాలు కలిసి ఫెన్సింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. వీధి దీపాలన్నీ వెలిగేలా చూడాలన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వేద పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ ఈవో శ్రీ విజయసారథి దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.
 
ఈ సమావేశంలో వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వర రావు, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి ఎఫ్ఎంఎస్ ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, డిఈ శ్రీమతి సరస్వతి, విజివో శ్రీ మనోహర్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి, డిఎఫ్ఓ శ్రీ చంద్రశేఖర్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.