THREE SPIRITUAL BOOKS RELEASED _ కల్పవృక్ష వాహ‌నసేవ‌లో మూడు ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ

Tirupati, 23, November 2022: On the fourth day of the ongoing Karthika Brahmotsavam of Sri Padmavati temple, Tiruchanoor, TTD released three spiritual publications.

The publications of TTD were released in front of Kalpa vruksha vahana by TTD EO Sri AV Dharma Reddy, Board member Sri Chevireddy Bhaskar Reddy, JEO Sri Veerabrahma.

Thereafter the authors of the spiritual books were felicitated with a shawl and Srivari Prasadam. OSDmof publications wing Dr Vibhishana Sharma was also present.

The publications were .1) &2 ) Bharatiya ganitha Shastra  Vol.1&2 scripted by Dr  Remella Avadhani,3) Sri Mata Vaishnodevi Mahatyam by MMV Subramaniam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కల్పవృక్ష వాహ‌నసేవ‌లో మూడు ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ
 
 తిరుప‌తి, 2022 నవంబర్ 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో నాలుగో రోజైన  బుధవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ఆధ్వ‌ర్యంలో ముద్రించిన మూడు గ్రంథాలను టిటిడిఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం ఆవిష్క‌రించారు. అనంత‌రం రచ‌యిత‌ల‌ను శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి ప్ర‌సాదం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.విభీషణ శర్మ పాల్గొన్నారు.
 
‘భారతీయ గణిత శాస్త్ర చరిత్ర 1 మరియు 2’ అనే గ్రంథాలను డాక్టర్. రేమెళ్ళ అవధానులు ర‌చించారు. 
 
శ్రీ శంకర బాలకృష్ణ దీక్షిత్ మరాఠ భాషలో రాసిన భారతీయ గణిత శాస్త్ర చరిత్రను  డాక్టర్ రేమల్లె అవధానులు తెలుగులో అనువదించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు, గ్రహణాలు, రాశి ఫలాలు, జననకాల లగ్నాలు, భవిష్యత్తును సూచించే సాముద్రికలు మొదలైనవి ఈ గ్రంథంలో వివరించారు.
 
‘శ్రీమాతా వైష్ణో దేవి మహత్యం’ అనే గ్రంథం శ్రీ ఎంఎంవి.సుబ్రహ్మణ్యం రచించారు. 
 
జమ్మూలోని కాట్రా నగరంలో త్రికోట పర్వతంపై శ్రీ సరస్వతీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పార్వతి కలిసి  శ్రీమాతా వైష్ణో దేవిగా వెలశారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భారతదేశంలోని క్షేత్ర మహత్యము తీర్థ ప్రాముఖ్యత తెలుస్తుంది. 
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.