SHRI TULJABHAVANI TEMPLE TRUST VISITS TIRUMALA TO STUDY TIRUMALA TEMPLE MANAGEMENT SYSTEM _ టిటిడి పాల‌న‌పై మహారాష్ట్రలోని శ్రీ తుల్జా భవాని ఆలయ అధికారుల అధ్యయనం

TIRUMALA, 23 NOVEMBER 2022: A team of officials from the Government of Maharastra along with Tuljapur legislator Sri Ranajagjit Sinha P Patil were on a three-day visit to Tirumala to study the temple management system and implement the same in Shri Tuljabhavani Temple.

 

The team comprising of District Collector Dr Sachin Ombase, SP Sri Atul Kulkarni, Chief Executive Officer Sri Rahul Gupta were briefed on the various activities, pilgrim amenities, darshan,  accommodation, prasadam, annaprasadam facilities, Engineering, Vigilance, Health, Medical, Srivari Seva, SVBC and other activities by concerned Heads of the departments through Power Point Presentation.

 

Later the team visited Annaprasadam Complex, CCTV Centre,  Vaikuntham Queue Complex and other places accompanied by the Liaison Officer and DyEO Sri Ananda Raju.

 

Speaking on occasion, the District Collector of Tuljapur Dr Sachin said, Shri Tuljabhavani temple in Osamabad District of Maharastra is one of the major centres of pilgrimage and nearly 80lakhs devotees visit every year. Especially on the two major festivals, Sharannavaratri and Chaitra Pournami days, over 15lakhs offer prayers in the temple. Shri Tuljabhavani is revered as Kuladevata of Chatrapati Shivaji Maharaj, the emperor of Marathas.

 

To develop amenities to the pilgrims, infrastructure, the temple Trust and officials visited the world-renowned Hindu Shrine of Lord Venkateswara to study and understand the pilgrim crowd management and other facilities being provided by TTD to the multitude of visiting pilgrims.

 

Earlier, SE II Sri Jagadeeshwar Reddy explained in detail about the pilgrim-friendly initiatives by TTD, Engineering works, water and electricity consumption, PACs etc., while VGO Vigilance Sri Giridhar gave the picture of the security apparatus in TTD through Power Point Presentation and the Special Officer Catering Sri GLN Sastry elaborated them on Annaprasadam activities and also shown them the cooking, storage, serving activities in MTVAC.

 

The team also dined in the Annaprasadam Complex and complimented the impeccable services of TTD to the scores of pilgrims.

 

VGO Sri Bali Reddy, DE Electrical Sri Ravishankar Reddy and other officials were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి పాల‌న‌పై మహారాష్ట్రలోని శ్రీ తుల్జా భవాని ఆలయ అధికారుల అధ్యయనం

తిరుమల, 2022 నవంబరు 23: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అమ‌లుచేస్తున్న ప‌రిపాల‌న విధానాలను, భక్తులకు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ లోని ప్రముఖ క్షేత్రమైన శ్రీ తుల్జా భవాని ఆలయ అధికారులు బుధవారం అధ్య‌య‌నం చేశారు. 

ముందుగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించి క్యూలైన్ల నిర్వహణ, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, ఆలయంలో భద్రత, పరిశుభ్రత చర్యలను పరిశీలించారు. అనంతరం అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఆయా విభాగాల అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కార్యకలాపాలను వివరించారు. తిరుమలలో ఇంజినీరింగ్ విభాగం భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను తెలియజేశారు. సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ విభాగాల ద్వారా భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివరించారు. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ వినియోగాన్ని తెలిపారు. తిరుమలలో నీటి అవసరాల కోసం జలాశయాల నిర్వహణ, పంపింగ్, శుద్ధీకరణ, జలప్రసాద కేంద్రాలు తదితరాలను తెలియజేశారు. విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో భక్తుల కోసం చేపడుతున్న భద్రతా చర్యలను తెలియజేశారు. పోలీసుల సమన్వయంతో తిరుమలలో పటిష్టమైన భద్రత, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం సీసీటీవీల ద్వారా భద్రత పర్యవేక్షణ గురించి చెప్పారు. లగేజి, సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ల నిర్వహణ, డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి వాటిని అప్పగించే విధానాలను వివరించారు.

అదేవిధంగా అన్నప్రసాదం కాంప్లెక్సులో భక్తులకు ఉచితంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పిస్తున్నామని తెలియజేశారు. అనంతరం శ్రీవారి సేవకుల సేవలు, ఎస్వీబీసీ, వ‌స‌తి క‌ల్ప‌న‌ విభాగం ద్వారా గదుల కేటాయింపు, ఎస్టేట్ విభాగం ద్వారా తిరుమలలో దుకాణాల కేటాయింపు, ఆస్తుల నిర్వ‌హ‌ణ‌, లీజుకు ఇవ్వ‌డం, దాతల విభాగం ద్వారా వివిధ ట్రస్టులు, విరాళాల సేకరణ, దాతలకు ప్రయోజనాల వర్తింపు తదితర అంశాలను టిటిడి అధికారులు తెలియజేశారు.

అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కాంప్లెక్సును పరిశీలించారు. అక్కడ భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే విధానాన్ని, వంటశాలను, స్టోర్ ను పరిశీలించి భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్, సీసీటీవీ సెంటర్ ను పరిశీలించారు. గురువారం నాడు తిరుపతిలోని వివిధ విభాగాలను అధ్యయనం చేయనున్నారు.

ఈ సందర్భంగా ఉస్మానాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సచిన్ మాట్లాడుతూ శ్రీ తుల్జాభవానీ ఆలయాన్ని ప్రతి సంవత్సరం దాదాపు 80 లక్షల మంది భక్తులు సందర్శిస్తారని తెలిపారు. ముఖ్యంగా శరన్నవరాత్రి, చైత్ర పౌర్ణమి రోజులలో 15 లక్షల మంది ఆలయంలో పూజలు చేస్తారని చెప్పారు. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కులదేవత శ్రీ తుల్జాభవాని అన్నారు. శ్రీవారి ఆలయంలో రద్దీ నిర్వహణ, భక్తులకు అందిస్తున్న ఇతర సౌకర్యాలను అధ్యయనం చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో ఉస్మానాబాద్ జిల్లా కలెక్టర్, ఆలయ ట్రస్టు చైర్మన్ డా. సచిన్ అంబాసే, తుల్జాపూర్ ఎమ్మెల్యే శ్రీ రాణాజగ్జీత్ సిన్హ పాటిల్, ఎస్పీ శ్రీ అతుల్ కులకర్ణి, సిఈఓ శ్రీ రాహుల్ గుప్తా, అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్య, టిటిడి ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఇ ఎలక్ట్రికల్ శ్రీ రవిశంకర్ రెడ్డి, లైజాన్ అధికారి శ్రీ ఆనందరాజు, అన్నదానం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్, వివిధ విభాగాలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.