TTD ADDITIONAL EO INTERACTS WITH VEGETABLE DONORS _ కూర‌గాయ‌ల దాత‌ల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం

Tirumala, 12 Oct. 20: Complimenting and thanking the vegetable donors, the Additional EO, Sri AV Dharma Reddy said that they have been rendering incredible service to the devotees of Lord Venkatewara by donating varieties of vegetables for preparation of Annaprasadam since 2004.

Speaking during a meeting held with Vegetable donors at Annamaiah Bhavan in Tirumala, the Additional EO said during 2019-20 nearly 18.57 lakh Kgs of vegetables were donated. 

“This year due to COVID-19 restrictions only 1.65 lakh Kgs of vegetables were donated till September. The donors have agreed to provide a variety of vegetables during the Navarathri Brahmotsavams slated to take place between October 16 to 24. The devotees coming for Brahmotsavams will get quality and delicious Annaprasadam every day”, he added.

DyEO of Anna Prasadam Sri Nagaraja, Catering Officer Sri GLN Shastri, AEO Lokanatham, vegetable donors from the states of Andhra Pradesh, Telengana, Tamilnadu and Karnataka were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కూర‌గాయ‌ల దాత‌ల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం

తిరుమల, 2020 అక్టోబ‌రు 12: తిరుమ‌లలో అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి వినియోగించే కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేసే దాత‌ల‌తో సోమ‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ఈ నెల 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఉండ‌డంతో భ‌క్తుల‌కు రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు మ‌రిన్ని ర‌కాల కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. దాత‌లు ఎంతో స‌హ‌కారం అందిస్తున్నార‌ని, 2004వ సంవ‌త్స‌రం నుండి నిరంత‌రాయంగా కూర‌గాయల స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. తాజా కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేస్తుండ‌డంతో అన్న‌ప్ర‌సాదాలు రుచిక‌రంగా, నాణ్యంగా ఉంటున్నాయ‌న్నారు. అన్నిర‌కాల కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోర‌డంతో దాత‌లు అంగీక‌రించారని తెలిపారు. 2019-20వ సంవ‌త్స‌రంలో 18.57 ల‌క్ష‌ల కిలోల కూర‌గాయ‌లు విరాళంగా అందాయ‌ని, ఈ ఏడాది కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా సెప్టెంబ‌రు నెల వ‌ర‌కు 1.65 ల‌క్ష‌ల కిలోల కూర‌గాయ‌లను దాత‌లు విరాళంగా అందించార‌ని వివ‌రించారు. 
 
ఈ స‌మావేశంలో అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ నాగ‌రాజ‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, ఏఈవో శ్రీ లోక‌నాథం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచి వ‌చ్చిన 15 మంది కూర‌గాయ‌ల దాత‌లు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.