TTD EO GETS VACCINATED AT TTD CENTRAL HOSPITAL _ కేంద్రీయ వైద్య‌శాల‌లో కోవిడ్ టీకా వేయించుకున్న టిటిడి ఈవో

Tirupati, 10 Apr. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy was served Covaxin vaccination at the TTD central hospital.

Speaking later he said employees working at Srivari temple, Vaikunta queue complex and all frontline workers in TTD local temples were already provided vaccination facility.

He said as per GOI guidelines he has directed all TTD employees above 45 years to be vaccinated from April 1 onwards.

TTD EO said he took the first dose of Covaxin vaccination today and after 4-6 weeks he will get the second dose.

He also asked the TTD employees who had taken the first dose to not delay in taking the second dose as prescribed.

The TTD Chief Medical Officer Dr Muralidhar accompanied the EO.

 ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER, TIRUPATI 

కేంద్రీయ వైద్య‌శాల‌లో కోవిడ్ టీకా వేయించుకున్న టిటిడి ఈవో

తిరుపతి, 2021 ఏప్రిల్ 10: టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని కేంద్రీయ వైద్య‌శాల‌లో ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శ‌నివారం కోవిడ్ టీకా వేయించుకున్నారు. అనంత‌రం వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, స్థానిక ఆల‌యాల్లో ప‌నిచేసే ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఇదివ‌ర‌కే కోవిడ్ టీకాలు వేయించిన‌ట్టు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఏప్రిల్ 1వ తేదీ నుండి 45 ఏళ్లు పైబ‌డిన ఉద్యోగులంద‌రికీ టీకా వేయించాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు చెప్పారు. తాను కూడా ఈరోజు కోవాక్సిన్ టీకా మొద‌టి డోసు వేసుకుని స‌ర్టిఫికేట్ పొందాన‌ని, 4 వారాల నుండి 6 వారాల మ‌ధ్య రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఇదివ‌ర‌కు టీకాలు వేయించుకున్న టిటిడి సిబ్బంది స‌మ‌యానుసారంగా రెండో డోసు వేసుకోవాల‌ని సూచించారు.

ఈవో వెంట ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.