ENLIST SECOND DOSE VACCINATION FOR EMPLOYEES- HODs TOLD _ కోవాగ్జిన్ రెండవ డోస్ కోసం హెచ్ ఓడి లకు వివరాలు ఇవ్వాలి

Tirupati, 20 May 2021: TTD Chief Medical Officer Dr Muralidhar has asked the Head of Departments of TTD to facilitate the employees seeking Second dose of Covid vaccination by collecting details of date first dose etc. and forward the same to CMO.

He said the district collector asked that all TTD employees should be provided vaccination at the Central hospital.

 TRIAGE CENTRE AT BIRRD

TTD has set up a Covid Triage Centre at the BIRRD hospital for testing pensioners and employees and assess whether hospitalisation is necessary or home quarantine is enough for the needy.

The CMO in a statement on Thursday urged the employees and pensioners to make good use of the facility available for it’s employees at BIRRD hospital.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కోవాగ్జిన్ రెండవ డోస్ కోసం హెచ్ ఓడి లకు వివరాలు ఇవ్వాలి

తిరుపతి 20 మే 2021: కోవాగ్జిన్ రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగులు రెండో డోస్ కోసం వారి విభాగాధిపతులకు వివరాలు అందించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్ ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగులు మొదటి డోస్ వేసుకున్న తేదీ, రెండో డోస్ ఎప్పుడు వేసుకోవాలనే వివరాలు హెచ్ఓడి లకు అందించాలన్నారు. వారు ఈ వివరాలను తమకు అందిస్తారని చెప్పారు.

ఉద్యోగులందరికీ సెంట్రల్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయడానికి జిల్లా కలెక్టర్ ను కోరతామని సి ఎం ఓ తెలిపారు. ఉద్యోగులు వెంటనే వివరాలు అందించాలని ఆయన కోరారు.

బర్డ్ లో ట్రయాజ్ సెంటర్

కరోనా లక్షణాలు కనిపించిన ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబసభ్యుల సౌకర్యం కోసం బర్డ్ ఆసుపత్రిలో ట్రయాజ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు బర్డ్ కు వెళితే పరీక్షలు నిర్వహించి వారు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చా, కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్ళాలా, కోవిడ్ ఆసుపత్రిలో చేరాల అన్నది నిర్ణయిస్తారు. ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది