GOVINDARAJA GRACES MUTYAPU PANDIRI _ ముత్య‌పు పందిరి వాహ‌నంపై శ్రీ గోవింద‌రాజ‌స్వామి

Tirupati, 20 May 2021: The third day evening witnessed Sri Govindaraja along with Sri and Bhu Devis on Mutyapu Pandiri Vahanam.

As a part of the ongoing annual brahmotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati on Thursday evening, the Utsava murthies were seated elegantly on the Pearl canopy.

The senior and Junior Pontiffs of Tirumala, Special Grade Deputy EO Sri Rajendrudu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్య‌పు పందిరి వాహ‌నంపై శ్రీ గోవింద‌రాజ‌స్వామి

తిరుపతి, 2021 మే 20: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం సాయంత్రం ముత్య‌పు పందిరి వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు రోజుకో వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందని భక్తుల విశ్వాసం.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఏ.టి.శ్రీ‌నివాస దీక్షితులు, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.