OPEN CONTROL ROOMS IN COVID HOSPITALS- TTD EO _ కోవిడ్ ఆసుప‌త్రిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి : టిటిడి ఈవో

Tirupati, 20 April 2021: TTD Executive Officer and Chairman of AP Covid Command Control Center, Dr KS Jawahar Reddy on Tuesday directed the Chittoor District Collector Sri Harinarayan to open control rooms at the SVIMS Covid hospital

A high level review meeting on the COVID-19 Pandemic situation was held at the TTD Administrative Building in Tirupati with Collector and TTD officials. EO directed officials concerned to set up a Nodal Officer for supervision of Covid services to affected persons.

He also told the district officials to utilise the Sri Padmavati Nilayam at Tiruchanoor, Vishnu Nivasam and Srinivasam Rest Houses in Tirupati for Covid isolation services as in the case of last year.

He also directed the TTD officials to hand over the Second and Third Choultries behind Railway Station to District Administration for Covid relief services.

He said there are 450 beds in SVIMS and directed officials to complete the ongoing works on the 5th floor on war footing and bring it to use for Covid services sooner. He also wanted all beds in the SV Ayurvedic hospital of TTD to be used for Covid and that the medical staff should work on three shifts and also induct medical staff from district hospitals, if needed.

The TTD EO instructed officials to purchase more wheel chairs and stretchers at SVIMS hospital for Covid services.

At the meeting the District Collector requested the TTD EO for supply of food packets and other materials for those at Covid Quarantine Centres as was done in last year for which EO issued necessary orders to TTD officials.

Additional EO Sri AV Dharma Reddy said TTD has launched stringent measures to ensure the health safety of devotees coming for Srivari Darshan at Tirumala. Besides spreading awareness through the Radio and Broadcast system on Covid guidelines, Dos and Don’ts, TTD has also kept in additional stock of sanitisers and masks at Tirumala.

Tirupati Municipal Corporation Commissioner Sri PS Girisha, Joint Collector Sri Veerabrahmam, TTD Incharge CMO Sri Muralidhar and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కోవిడ్ ఆసుప‌త్రిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి : టిటిడి ఈవో

 తిరుపతి, 2021 ఏప్రిల్ 20: తిరుప‌తిలోని స్వీమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో కంట్రోల్ రూం‌ను ఏర్ఫా‌టు చేయాలని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ హ‌రినారాయ‌ణ్‌ను కోరారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం ఉద‌యం జిల్లా క‌లెక్ట‌ర్‌, టిటిడి అధికారుల‌తో కోవిడ్ -19 వ్యాప్తిపై ఈవో సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ కోవిడ్‌ ఆసుప‌త్రిలో కంట్రోల్ రూంల‌ను ఏర్పాటు చేసి, త‌ద్వారా ఎప్ప‌‌టిక‌ప్పుడు కోవిడ్ బాధితులకు మ‌రింత మెరుగైన వైద్యం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ను కోరారు. ఇందులో భాగంగా కోవిడ్ బారిన ప‌డిన బాధితుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఒక నోడ‌ల్ అధికారిని జిల్లా యంత్రాంగం త‌రపున నియ‌మించాల‌న్నారు. తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యం, తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం వ‌స‌తి స‌మూదాయాలను గ‌త సంవ‌త్స‌ర‌ము వ‌లే కోవిడ్ బాధితుల‌కు వినియోగించాల‌ని క‌లెక్ట‌ర్‌ను కోరారు. రెల్వేస్టేష‌న్ వెనుక వైపు ఉన్న రెండ‌వ, మూడ‌వ స‌త్రాల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిధిలో ఉంచాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.

ప్ర‌స్తుతం స్వీమ్స్‌లో 450 బెడ్లు ఉన్నాయ‌ని, ఐద‌వ అంత‌స్తులో జ‌రుగుతున్న ప‌నుల‌ను త్వ‌రిత గ‌తిన‌ పూర్తిచేసి కోవిడ్ బాధితుల‌కు అందుబాటులోనికి తీసుకురావాల‌న్నారు. టిటిడి ప‌రిధిలోని ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రిలో ఉన్న బెడ్ల‌ను కోవిడ్ బాధితుల‌కు పూర్తిగా వినియోగించాల‌ని, ఆసుప‌త్రి సిబ్బంది మూడు షిప్టుల వారిగా విధులు నిర్వ‌హిస్తున్నార‌న్నారు. అవ‌స‌ర‌మైతే జిల్లా యంత్రంగం ఈ ఆసుప‌త్రికి మ‌రికొంత మంది సిబ్బందిని స‌మ‌కుర్చాల‌న్నారు. స్విమ్స్‌ ఆసుప‌త్రికి వీల్ చైర్స్‌, స్ట్రెచ‌ర్స్, త‌దిత‌ర‌ అవ‌స‌ర‌మైన వాటిని కొనుగోలు చేయాల‌న్నారు.

కోవిడ్ బాధితుల‌కు కోవిడ్ క్వారంటైన్ సెంట‌ర్ల‌ల్లో, ఆసుప‌త్రుల‌లో గ‌త సంవ‌త్స‌రం పేషంట్ల‌కు టిటిడి నిధుల ద్వారా నాణ్య‌మైన భోజ‌నం అందించార‌ని, అదేవిధంగా ఈ సంవ‌త్స‌రం కూడా స‌రుకులు అందించాల‌ని క‌లెక్ట‌ర్ ఈవోను కోరారు. దీనిపై సంబంధిత అధికారులు చర్య‌లు తీసుకోవాల‌ని ఈవో ఆదేశించారు.

అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమ‌లకు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా కోవిడ్ – 19 వ్యాప్తి చెంద‌కుండా క‌ట్టు దిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టిన్న‌ట్లు తెలిపారు. టిటిడి రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ ద్వారా కోవిడ్ నిబంధ‌న‌లు, జాగ్ర‌త్త‌ల‌పై భ‌క్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌న్నారు. తిరుమ‌ల‌లో అవ‌స‌ర‌మైన‌న్ని శానిటైజ‌ర్లు, మాస్కులు అందుబాటులో ఉన్న‌ట్లు ఆయ‌న ఈవోకు వివ‌రించారు.

ఈ స‌మావేశంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీ పి.ఎస్.‌గిరిషా, జాయింట్ క‌లెక్ట‌ర్ శ్రీ వీర‌బ్ర‌హ్మం, స్విమ్స్ డైరెక్ట‌ర్ డా. వెంగ‌మ్మ, డిఎమ్‌హెచ్‌వో శ్రీ పెంచ‌లయ్య‌, టిటిడి ఇంచార్జ్ సిఎమ్‌వో డా. ముర‌ళీధ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.