GRAND DURGA PUJA AND CHANDI HOMA AT SRI KT _ క‌పిల‌తీర్థంలో శాస్త్రోక్తంగా దుర్గాపూజ – చండీహోమం

Tirupati, 9 Dec. 20: As part of ongoing Karthikamasa Deeksha program mulled by TTD, Durga Puja and Chandi Homam were performed at the Sri Kapileswara Swamy temple on Wednesday.

Explaining the significance of the puja, Veda Scholar Sri Pavana Kumara Sharma said TTD has been conducting the Homa and vratas to beget relief from pandemics and evil forces on humanity.

Earlier special pujas were performed to the utsava idols Sri Durga Ammavaru with Sankalpam, followed by Naivedyam, Harati and the worship concluded with Kshama Prarthana and Mangalam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క‌పిల‌తీర్థంలో శాస్త్రోక్తంగా దుర్గాపూజ – చండీహోమం

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 09: కార్తీక మాస దీక్ష‌ల్లో భాగంగా బుధవారం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌య ప్రాంగ‌ణంలో దుర్గాపూజ – చండీహోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఈ సంద‌ర్భంగా పండితులు శ్రీ ప‌వ‌న కుమార శ‌ర్మ పూజ విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. ప్రస్తుత పరిస్థితుల నుండి మానవాళిని రక్షించాలని స్వామివారిని ప్రార్థిస్తూ టిటిడి హోమాలు, వ్ర‌తాలు నిర్వ‌హిస్తోంద‌న్నారు. దుర్గా పూజ వ‌ల్ల దుష్టశక్తుల ప్రభావం తొలగుతుందని, వ్యాధులు ద‌రి చేర‌కుండా క్షేమం కలుగుతుందని, ధైర్యం చేకూరుతుందని తెలిపారు.

ముందుగా శ్రీ దుర్గాదేవి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. సంక‌ల్పంతో పూజ‌ను ప్రారంభించి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.