ORGANIC NAIVEDYAM TO GOVINDA- TTD CHAIRMAN _ గోవిందుడికి గో ఆధారిత ప్ర‌కృతి నైవేద్యం : టిటిడి ఛైర్మ‌న్

Tirumala, 1 May 2021: TTD has commenced preparation of Srivari Naivedyam from organic products like rice vegetables, jaggery, desi cow ghee and pulses, says TTD Chairman Sri YV Subba Reddy on Saturday.

Speaking to media later the TTD chairman said TTD had revived the 100-year-old practice and glory of the Srivari temple of preparing Srivari naivedyam with organic farm produces on Saturday.

He said devotees who tasted the Anna Prasadam today appreciated the change in the rich taste and TTD has resolved to continue the use of organic farm products on a permanent basis in preparations of Srivari Anna Prasadams.

He said similarly Organic Bengal gram and jaggery were used today in the TTD potu (Srivari kitchen) to prepare Srivari Laddu naivedyam.

He said officials were directed to interact with farmers practising organic farming in the country and to procure organic products directly from them.

TTD Additional EO Sri AV Dharma Reddy and TTD Board members Sri Shiva Kumar, Sri Shekar Reddy and Dr Nishita were present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గోవిందుడికి గో ఆధారిత ప్ర‌కృతి నైవేద్యం : టిటిడి ఛైర్మ‌న్

తిరుమల, 2021 మే 01: తిరుమ‌ల శ్రీ‌వారికి గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో పండించిన బియ్యం, కూర‌గాయ‌లు, బెల్లం, ప‌ప్పుదినుసుల‌తో త‌యారు చేసిన అన్న‌ప్ర‌సాదాల‌ను నిత్య నైవేద్యంగా శ‌నివారం నుండి పునః ప్రారంభించిన‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్‌ మీడియాతో మాట్లాడుతూ గోవిందుడికి గో ఆధారిత ప్ర‌కృతి నైవేద్యం స‌మ‌ర్పించే సాంప్ర‌దాయం దాదాపు 100 సంవ‌త్స‌రాల క్రితం వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో పండించిన బియ్యం, కూర‌గాయ‌లు, అర‌టిపండ్లు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితో త‌యారుచేసిన అన్న‌ప్ర‌సాదాల‌ను స్వామివారికి నైవేద్యంగా స‌మ‌ర్పించ‌డం ద్వారా పూర్వ వైభ‌వాన్ని తెచ్చామ‌న్నారు. భ‌క్తులు ప్ర‌తి రోజు స్వీక‌రించే ప్ర‌సాదానికి ఈ ప్ర‌సాదానికి రుచిలో చాలా తేడా ఉన్న‌ట్లు చెప్పారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ఆల‌యంలో శాశ్వ‌తంగా గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో పండించిన వంట స‌రుకుల‌తో నైవేద్యం స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు ఛైర్మ‌న్ వివ‌రించారు.

అదేవిధంగా శ‌న‌గ‌లు, బెల్లంతో ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారు చేసిన‌ట్లు తెలిపారు. దీనిపై అధికారుల‌తో స‌మీక్షించి సేంద్రియ వ్య‌వ‌సాయం చేసే రైతులను గుర్తించి, వారి నుండి నేరుగా సేక‌రించేందుకు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలిస్తామ‌న్నారు.

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, డా.నిశ్చిత ఛైర్మ‌న్ వెంట ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.