TTD CHAIRMAN EXPRESSES SHOCK OVER THE DEATH OF GOSAMRAKSHAKAS _ గో రక్షకుల మృతిపై టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి

TIRUPATI, 17 JANUARY 2022: TTD Chairman Sri YV Subba Reddy on Monday expressed shock and grief over the accidental death of Gosamrakshakas at Choutuppal in Bhuvanigiri district of Yadadri in the state of Telangana.

 

Former TTD Trust board member Sri Siva Kumar explained to the Chairman about the accident which killed two persons in the road accident that took place on January 16 when a bus hit the vehicle where seven Gosevaks were travelling.

 

The Chairman stated that he will visit the houses of the deceased soon and will extend support to the bereaved families of the deceased.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గో రక్షకుల మృతిపై టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి
– మృతుల కుటుంబాలను త్వరలో పరామర్శిస్తానని ప్రకటన

తిరుపతి 17 జనవరి 2022: తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జనవరి 16వ తేదీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గో సంరక్షకులు పృథ్వి తో పాటు మరొకరు మరణించడం పట్ల టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఏడుగురు గో రక్షకులు ప్రయాణిస్తున్న కారును చౌటుప్పల్ వద్ద బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో పృథ్వీ తో పాటు మరొకరు మరణించారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన నలుగురు క్షేమంగా బయట పడిన సంఘటన గురించి గోసంరక్షణ ఉద్యమ నాయకులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ శివకుమార్ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి వివరించారు. ఈ సంఘటన పై ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ సుబ్బారెడ్డి త్వరలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తానని చెప్పారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది