PRANAYA KALAHOTSAVAM ON JAN 18 _ తిరుమలలో జనవరి 18న శ్రీవారి ప్రణయకలహోత్సవం

Tirumala, 17 Jan. 22: The unique annual festival, Pranaya Kalahotsavam will be observed in Tirumala on January 18. 

 

The processional deities of Sri Malayappa Swamy on one palanquin and His consorts on different palanquins will reach opposite Swamy Pushkarini.

 

The Jeeyangars recite Nammalwar Pasurams written in “Nindastuti” mode on the occasion.

 

Later the religious staff divides into two groups with one supporting Sri Malayappa and another taking the side of Goddesses.

 

The love enacted in this unique festival makes everyone in splits as the Goddesses throws floral balls on Sri Malayappa. With the Swamy varu asking both the Goddesses for an apology, the interesting fest concludes on a happy note and the deities enter inside the temple again. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తిరుమలలో జనవరి 18న శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమల, 2022 జనవరి 17: శ్రీవేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 18వ తేదీ తిరుమలలో వైభవంగా జరుగనుంది.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం||ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.