CHAIRMAN INSPECTS GHAT ROAD WORKS _ ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

TIRUMALA, 09 JANUARY 2022: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Sunday inspected the restoration works of the second ghat road.

 

He interacted with the AFCON team which is carrying out the repairs and directed them that the road shall be brought into use for pilgrims by the night of January 11. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

– జనవరి 11వ తేదీకి పనులు పూర్తి చేయాలని ఆదేశం

– 11వ తేదీ రాత్రి నుంచి అప్ ఘాట్ రోడ్డును భక్తులకు ఉపయోగం లోకి తెస్తాం : శ్రీ సుబ్బారెడ్డి

తిరుమల 9 జనవరి 2022: అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డును వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 11వ తేదీ రాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనులను ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. పనులను పర్యవేక్షిస్తున్న ఆప్కాన్ సంస్థ అధికారులు, పని చేస్తున్న కూలీలతోను చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడారు. పనులు జరుగుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. 11వ తేదీ సాయంత్రానికి పనులు పూర్తి చేసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేస్తామని చైర్మన్ తెలిపారు. 11వ తేదీ రాత్రి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఘాట్ రోడ్డు భక్తులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టు సంస్థ వారిని ఆదేశించారు. మరమ్మతు పనులు రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది