చిలుకూరు శ్రీవేంకటేశ్వర వేదపాఠశాల ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

చిలుకూరు శ్రీవేంకటేశ్వర వేదపాఠశాల ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

తిరుపతి, 2010 జూలై 28: శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల, చిలుకూరు, మంథని మరియు విజయనగరం నందు బోధింపబడు ఈ క్రింది కోర్సులలో ప్రవేశం కొఱకు వైదిక సంప్రదాయ పద్థతి ప్రకారం ఉపనయనమై, నిర్థిష్ట వయస్సు, విద్యార్హతలు గల బాలుర నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. క్రింది నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులను, పుట్టిన తేది, విద్యార్హతలు రుజువు చేసే ధృవపత్రం (టి.సి.కాకుండా) నకళ్ళకు, పాస్‌పోర్ట్‌సైజు ఫోటో ఒకటి, స్వంత చిరునామా పోస్టుకార్డుకు జతపరచి, ప్రిన్సిపాల్‌, ఎస్‌.వి.వి.ఎస్‌. పాఠశాల, కీసరగుట్ట-501301, రంగారెడ్డి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ అను చిరునామాకు 15-08-2010 లోపుగా చేరునట్లు పంపవలెను.

వైదిక సంప్రదాయ పద్థతిలో శిక్షణ ఇవ్వబడే ఈ కోర్సుల అధ్యయనకాలంలో, భోజనము, వసతి మొదలగు సౌకర్యములు ఉచితముగా కల్పించబడతాయి. మరియు ఒక్కొక్క విద్యార్థికి రు.3,00,000/- (అక్షరాలా మూడు లక్షల రూపాయలు)చొప్పున బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి, వారు తమ కోర్సును విజయవంతముగా పూర్తి చేసిన పిదప, బ్యాంక్‌ వారిచ్చు వడ్డీతో సహా విద్యార్థికి పారితోషికముగా ఇవ్వబడును.

అభ్యర్థులు, స్వంత ఖర్చులతో వ్రాత మౌఖిక పరీక్షలకు హాజరుకావలెను. సిఫార్సుతో కూడిన దరఖాస్తులు తిరస్కరించబడును. ప్రవేశం విషయంలో యాజమాన్యం వారిదే అంతిమ నిర్ణయం పాఠశాలలో ప్రవేశం పొందిన తరువాతనే టి.సి. సమర్పింపలెను.

కోర్సు వివరము            కాలపరిమితి అర్హత
కృష్ణయజుర్వేదము 12 సంవత్సరాలు 5వ తరగతి ఉతీర్ణుడై 1-7-1998
తైత్తార్తీయ శాఖ,                      నుండి 30-06-2000 మధ్య
మరియు ఋగ్వేదము          జన్మించి ఉండాలి.
ఆశ్వలాయన శాఖ,
సలక్షణపోనాన్తము

ధరఖాస్తు నమూనా
1. అభ్యర్థిపేరు 2. పుట్టిన తేది 3. తండ్రి పేరు 4. తండ్రి వృత్తి 5. పూర్తి చిరునామా, ఫోన్‌ నెం. 6.సంప్రదాయాను సారముగా ఉపనయనము జరిగిన వివరములు ఎ)కులము బి) గోత్రము సి)ఋషిప్రవరలు డి)సూత్రము ఇ) వేథాఖ 7. విద్యార్హతలు 8. చేరదలచిన కోర్సు 9.సంప్రదాయ విద్యల పూర్వ పరిచయము 10. కేటాయించిన ఏ ఇతర కోర్సులోనైనా చేరుటకు అంగీకరించెదరా? 11.అభ్యర్థి సంతకము 12.తండ్రి లేక సంరక్షకుని సంతకము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.