ఆగష్టు 5 నుండి 18వ తేది వరకు ఖమ్మం జిల్లాలో గోవింద కల్యాణాలు

ఆగష్టు 5 నుండి 18వ తేది వరకు ఖమ్మం జిల్లాలో గోవింద కల్యాణాలు

తిరుపతి, 2010 జూలై 29: తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గోవింద కల్యాణాలు నాల్గవ విడతగా ఆగష్టు 5వ తేది నుండి 18వ తేది వరకు ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో వైభవంగా జరుగుతాయి.

ఈ గోవింద కల్యాణాలు ఖమ్మం జిల్లాలో క్రింది ప్రాంతాలలో ఆయా తేదీలలో జరుగుతాయి.
ప్రదేశం  తేది
దమ్మపేట   05-08-2010
పెనుపల్లి   06-08-2010
యెనుకూరు   07-08-2010
టేకులపల్లి   08-08-2010
భూర్గంపహడ   09-08-2010
వెంకటాపురం            11-08-2010
చెర్ల    12-08-2010
దుమ్మగూడం     13-08-2010
కోనవరం 14-08-2010
వర రామచంద్రాపురం 16-08-2010
ఇల్లిండ్లు 18-08-2010

ఈ గోవింద కల్యాణాలలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా తితిదే వైద్యవిభాగం గోవిందకల్యాణాలు జరిగే ప్రతిచోట ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.