జనవరి 15న ఎస్వీ గోసంరక్షణశాలలో ఘనంగా కనుమ పండుగ 

జనవరి 15న ఎస్వీ గోసంరక్షణశాలలో ఘనంగా కనుమ పండుగ

తిరుపతి, జనవరి 08, 2013    : తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీన కనుమ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.
 
సకల దేవతా నిలయమైన గోవును పూజించడం మన హిందూ సాంప్రదాయం. ప్రతి ఏడాదీ కనుమ పండుగ రోజున తితిదే గోసంరక్షణశాలలో ఈ ఉత్సవం జరపడం ఆనవాయితీ.
 
పశువుల షెడ్ల వద్ద దేవస్థానం అధికారులు ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసం వగైరాలను భక్తులు స్వయంగా పశువులకు తినిపించవచ్చు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులుకాగలరు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్తు, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.