తితిదే ఆలయాల్లో స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు భక్తులు తిరిగి పొందే అవకాశం

తితిదే ఆలయాల్లో స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు భక్తులు తిరిగి పొందే అవకాశం

తిరుపతి, జనవరి 08, 2013: నిబంధనలను అతిక్రమించి ఆలయాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లిన భక్తుల నుండి స్వాధీనం చేసుకున్న వాటిని భక్తులు తిరిగి పొందే అవకాశాన్ని తితిదే కల్పిస్తోంది. ఇందుకోసం భక్తులు తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఉన్న ట్రెజరీ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి-2ను కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు.

భక్తులు రూ.500/- నగదు చెల్లించడంతో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నప్పుడు ఇచ్చిన రశీదును చూపాల్సి ఉంటుంది. మూడు వారాల్లోపు భక్తులు సెల్‌ఫోన్లు తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో తితిదే అధికారులు జప్తు చేస్తారు. ఇతర వివరాలకు 0877-2264221 నంబరులో సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.