LOCAL TEMPLES GEARS UP FOR BIG DAY _ జనవరి 28న టిటిడి అనుబంధ ఆలయాల్లో రథసప్తమి

TIRUPATI, 27 JANUARY 2023: All the local and temples under the umbrella of TTD have geared up to observe Radhasapthami on Saturday.

 

Tiruchanoor, Srinivasa Mangapuram, Kodandarama temple, Appalayagunta, Karvetinagaram, Nagalapuram, Narayanavanam etc. are spruced up for the big fete.

 

The Deputy EOs of the respective temples are taking care of the arrangements for Radha Sapthami.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

జనవరి 28న టిటిడి అనుబంధ ఆలయాల్లో రథసప్తమి
 
తిరుపతి, 2023 జనవరి 27: టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో జనవరి 28వ తేదీ శనివారం రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం,  అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం, నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినం కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు.  
 
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 
 
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటినుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.
 
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
 
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరుగనుంది.
 
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు సూర్యప్రభ, హంస, చిన్నశేష, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం జరుగనున్నాయి. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
 
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సూర్యప్రభ, హంస, కల్పవృక్షవాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం జరుగనున్నాయి. సాయంత్రం 4.30 నుండి రాత్రి 8 గంటల వరకు శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన శ్రీవారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.